Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మెగా కృష్ణారెడ్డి కి ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇవ్వడంపై షర్మిల మండిపాటు …!

అవినీతి పరుడికి నల్లధనం ఉన్నవాడికి ,జిఎస్టి బకాయిదారుడికి ప్రాజెక్టులా ? షర్మిల!
-రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు?
-తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల ఫైర్
-మెగా కృష్ణారెడ్డిపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదన్న షర్మిల
-ఇద్దరూ తోడుదొంగలనా? అంటూ ఆగ్రహం
-బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు ఎందుకు మాట్లాడటంలేదు

రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టాలన్న మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు…దానిలో ఉన్న మతలబు ఏమిటి ? తెలంగాణాలో ప్రాజెక్టులు కట్టేవాళ్లే లేరా..? అవినీతి పరుడని , నల్లధనం బాగా ఉందని , జిఎస్టి కట్టకుండా ఉన్నదని చెబుతున్న మెగా కృష్ణారెడ్డి పై కేసీఆర్ కు ఎందుకు అంట ప్రేమ అని వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ధ్వజమెత్తారు .

రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారంటూ నిలదీశారు. మా తెలంగాణ వాళ్లకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా? లేక ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచుకోవచ్చనా? అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

మెగా కృష్ణారెడ్డి రూ.70 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని, దీనికి సంబంధించి రూ.12 వేల కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉందని స్వయంగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ చెబుతున్నా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇద్దరూ తోడుదొంగలనా? అంటూ మండిపడ్డారు.

“ఈ విషయంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడంలేదు? మెగా కృష్ణారెడ్డి మీకు కూడా దోస్తు కాబట్టి, మీకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి మాట్లాడడంలేదా?” అంటూ ఇతర విపక్ష నేతలను సైతం షర్మిల ప్రశ్నించారు.

Related posts

జానారెడ్డి ఎన్నిక రాష్ట్ర రాజకీయాలకు మలుపు కావాలి

Drukpadam

చంద్రబాబు ,రామోజీ రావులు కావాలనే దుష్ప్రచారం : సీఎం జగన్…

Drukpadam

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్!

Drukpadam

Leave a Comment