Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్ర‌బాబు టూర్‌లో మాజీ మంత్రి ప‌ర్సు కొట్టేసిన దొంగ‌లు!

చంద్ర‌బాబు టూర్‌లో మాజీ మంత్రి ప‌ర్సు కొట్టేసిన దొంగ‌లు!
-వ‌ర‌ద ప్రాంతాల్లో 2 రోజులు ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు
-చంద్ర‌బాబు వెంట ఉత్సాహంగా పాల్గొన్న గొల్ల‌ప‌ల్లి
-మాయ‌మైన ప‌ర్సులో రూ.35 వేల న‌గ‌దు, 2 ఏటీఎం కార్డులు
-మరికొందరి పర్సులు కూడా మాయం …

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో దొంగల చేతివాటం చూపించారు. రాజోలులో వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. ఇదే అదునుగా భావించిన దొంగలు రెచ్చిపోయారు. మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పర్స్‌ కొట్టేశారు. అందులో 35వేల నగదు, 17వేల విదేశీ కరెన్సీ, రెండు ఏటీఎం కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాజోలు పీఎస్‌లో సూర్యారావు ఫిర్యాదు చేశారు.మరో 20 మంది పర్సులు కూడా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలువురి కార్యకర్తలు, అభిమానుల సెల్‌ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి.

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు రెండు రోజుల పాటు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో జ‌రిపిన ప‌ర్య‌ట‌న శుక్ర‌వారం సాయంత్రంతో ముగిసింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌రిధిలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాలో చంద్ర‌బాబు జ‌రిపిన ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్న మాజీ మంత్రి గొల్ల‌ప‌ల్లి సూర్యారావుకు షాక్ త‌లిగింది. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న వెంట సూర్యారావు బిజీగా ఉండ‌గా… సూర్యారావు జేబులో ఉన్న ప‌ర్సును మాత్రం దొంగ‌లు కొట్టేశారు. సూర్యారావు తో పాటు మరికొందరి పర్సులు కూడా మాయమయ్యాయని కార్యకర్తలు వాపోయారు . పర్సులు కాకుండా కొందరి సెల్ ఫోన్ లు కూడా దొంగలు కొట్టేచారు.

గొల్ల‌ప‌ల్లి సూర్యారావు పోగొట్టుకున్న ప‌ర్సులో రూ.35 వేల న‌గ‌దుతో పాటు 2 ఏటీఎం కార్డులు కూడా ఉన్నాయ‌ట‌. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ముగిశాక తీరా త‌న జేబులో చేయి పెడితే.. అందులో ప‌ర్సు లేని విష‌యాన్ని గుర్తించిన సూర్యారావు షాక్ తిన్నారు. ఆ వెంట‌నే తేరుకుని ఆయ‌న నేరుగా రాజోలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

Related posts

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు …8 ఐఏఎస్ లకు జైలు శిక్ష!

Drukpadam

ఏపీ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు కేసులో సుప్రీం సంచలన తీర్పు!

Drukpadam

ఖమ్మంలో టీఆర్ యస్ నుంచి భారీ క్రాస్ ఓటింగ్ …పార్టీ లో అంతర్మధనం

Drukpadam

Leave a Comment