Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హరిద్వార్ లో కుంభమేళా ….లక్షల మంది భక్తుల పుణ్య స్నానాలు…

 

Huge crowds rushes to Khumb Mela despite corona scares

 

హరిద్వార్ లో కుంభమేళా ….లక్షల మంది భక్తుల పుణ్య స్నానాలు
మోగుతున్న ప్రమాద ఘంటికలు … కరోనా నేపథ్యంలో ఆందోళన
-గత కొన్నిరోజులుగా కుంభమేళా
-నేడు పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు
-మాస్కుల్లేకుండానే వస్తున్న భక్తులు
-కష్టసాధ్యంగా మారిన భౌతికదూరం నిబంధన అమలు
మొదట్లో ఒక్క కరోనా కేసు వచ్చిన హడావుడి చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ,సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న పెద్దగా పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. కర్ఫ్యూ లు పెట్టి నిషేధ ఆజ్ఞలు విధించి పటిష్ట చర్యలు తీసుకున్న పాలకులు ఇప్ప్డుడు నిభందనలు పెట్టినప్పటికీ పటిష్టంగా అమలు చేయటంలేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఒక్కరోజులోనే లక్ష 65 కేసులు నమోదు కావటంతో ప్రజలు భయబ్రాంతులకు గురిఅవుతున్నారు. మాస్క్ మస్ట్ అనే కాన్సెప్ట్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చాయి. శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం , మాస్క్ ధరించటం పై నిబంధనలు కఠినంగా ఉండాల్సిందే అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకపోతే 1000 రూపాయల జరిమానా విధించే ఉత్తర్వులు జారీచేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించకపోయిన రాష్ట్రమంతా 144 సెక్షన్ పెట్టి కఠినంగా వ్యవహరిస్తోంది. దీనితో కేసులు సంఖ్య భారీగా తగ్గించగలిగారు. కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించాలని నిర్ణయించింది. ఎన్నికలు జరగుతున్న పశ్చిమ బెంగాల్ , అస్సోమ్ ,రాష్ట్రాలలో కేసుల సంఖ్య భారీగా పెరగటంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. తమిళనాడు, కేరళ , పాండిచేరీ లాంటి రాష్ట్రాలలో ఎన్నికల వల్లనే కేసుల సంఖ్య పెరిగిందని అభిప్రాయాలూ ఉన్నాయి.
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వద్ద గత కొన్నిరోజులుగా మహాకుంభ్ పేరిట కుంభమేళా కొనసాగుతోంది. నిత్యం లక్షల మంది భక్తులు, సాధువులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఓవైపు దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లక్షల మంది ఒక్కచోటే గుమికూడుతున్న దృశ్యాలు కుంభమేళాలో దర్శనమిస్తున్నాయి. నిన్న ‘షాహీ స్నాన్’ సందర్భంగా పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఘాట్ల వద్దకు పోటెత్తారు. వీరిలో చాలామందికి మాస్కులు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. కరోనా నివారణలో భౌతిక దూరం కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశం అయినా, ఇక్కడ కరోనా మార్గదర్శకాల అమలు కష్టసాధ్యంగా మారింది. హరిద్వార్ లో 2 రోజుల్లో 1000 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడం పరిస్థితి ఎలా ఉందో చెబుతోంది. లక్షల మంది పవిత్ర స్నానాలకు వస్తున్నా భక్తులను కంట్రోల్ చేయడం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.

Related posts

పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం….

Drukpadam

ఏపీ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు…పేదవాడి వైద్యానికి ప్రభుత్వం భరోసా : సీఎం జగన్

Drukpadam

టీటీడీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment