Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఐదు గ్రామాల ప్రజల మనోభీష్టాన్ని గౌరవించి తెలంగాణాలో కలపాలి ..మంత్రి పువ్వాడ!

ఐదు గ్రామాల ప్రజల మనోభీష్టాన్ని గౌరవించి తెలంగాణాలో కలపాలి ..మంత్రి పువ్వాడ!
అందుకు ప్రజలు చేస్తున్నపోరాటానికి సంపూర్ణ మద్దతు
ప్రజా పోరాటం మరింత ఉధృతం కాబోతుంది
మా డిమాండ్ ఇవాళ ప్రజాపోరాట రూపం దాల్చింది
కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
తెలంగాణలో తిరిగి విలీన గ్రామాలు
కలపాలని డిమాండ్ చేస్తూ నిరసనలు
ప్రజాభిప్రాయమే తమ జెండా, ఎజెండా
కేంద్రం, ఏపీ ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి
కరకట్టల నిర్మాణానికే 5 గ్రామాలు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నాం

పోలవరం ఎత్తు పెంచడంవల్ల టెంపుల్ సిటీ గా భద్రాచలం ముంపు భారిన పడుతుంది…భద్రాచలానికి వరద నీరు రాకుండా ఉండాలంటే చుట్టూ కరకట్ట నిర్మించడం ఒక్కటే మార్గం అందుకు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ఐదు గ్రామాలను వెంటనే తెలంగాణ తిరిగి విలీనం చేసేలా పార్లమెంట్ లో చట్టం తేవాలి …ఐదు గ్రామాల ప్రజలు కూడా ఆంధ్రా లో ఉండేందుకు ఇష్టపడటం లేదు . ఇప్పటికే ప్రజలు ఉద్యమం చేపట్టారు . వారి ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మనోభీష్టాలను గౌరవించి వెంటనే తెలంగాణాలో కలపాలని మంత్రి అజయ్ డిమాండ్ చేశారు .

ఆంధ్రాలో కలిపిన విలీన గ్రామాల ప్రజలు తిరిగి తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతూ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆదివారం నుంచి ప్రారంభమైన విలీన గ్రామాల ప్రజలు నిరసనలకు మంత్రి అజయ్ సంఘీభావం ప్రకటించారు. ప్రజా పోరాటం మరింత ఉధృతం కాకముందే కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రజాభిప్రాయం మేరకు తెలంగాణలో 5 గ్రామాలను తిరిగి కలపాలని మంత్రి డిమాండ్ చేశారు.

తాను ఇటీవల డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేసిన విషయంపైనే ఇవాళ ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారని, ఇది ప్రజా పోరాటంగా మారుతుంది అని మంత్రి అజయ్ అన్నారు. ప్రజాభిప్రాయమే తమ జెండా, ఎజెండా అని మంత్రి తేల్చి చెప్పారు.

భ‌ద్రాచ‌లం ప‌క్క‌నే ఉన్న పిచ్చుకలగూడెం, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తం పట్నం, గుండాల గ్రామాలను తెలంగాణ‌లో క‌ల‌పాలని ఈ ఐదు గ్రామాల అంశంపై కేంద్రం ఆలోచించాల‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ సూచించారు.

ఇటీవల వచ్చిన వరదల వల్ల ఆ గ్రామాలు నీట మునిగి తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని, వారిని ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి భద్రాచలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని గుర్తు చేశారు. పోలవ‌రం కోసం తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్రాలో క‌లిపిన‌ప్పుడు సీఎం కేసిఆర్ నేతృత్వంలో నిర‌స‌న తెలిపామ‌న్నారు.

భ‌ద్రాచ‌లం ప్ర‌జ‌లు, ఆల‌యం నీట మున‌గ‌కుండా ఉండాల‌నేది త‌మ ఉద్దేశ‌మ‌ని క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణానికి 5 గ్రామాల‌కు ఇవ్వాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. భ‌ద్రాచ‌లం ప‌క్క‌నే ఉన్న ఆ 5 గ్రామాల‌ను క‌లిపితేనే క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం సాధ్య‌మ‌వుతుంద‌న్నారు.

కేంద్రం, ఏపీ ప్రభుత్వం బేష‌జాల‌కు పోకుండా ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని, వ‌ర‌ద ముంపు బాధితుల ఆవేద‌న‌ను అర్థం చేసుకోవాల‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

Related posts

సీఎల్పీ సమావేశం నుంచి జగ్గారెడ్డి వాక్ అవుట్ !

Drukpadam

తెలంగాణలో పార్టీ ప్రక్షాళన దిశగా బీజేపీ …!

Drukpadam

ప్రధాని సభలో సీఎం కేసీఆర్ కు కుర్చీ!

Drukpadam

Leave a Comment