కృష్ణయ్య ను చంపిన వారు ఎవరైనా సహించబోము: తుమ్మల వార్నింగ్
టీఆర్‌ఎస్ పార్టీ నేత కృష్ణయ్య ను చంపిన వారు ఎవరైనా సహించబోమమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వార్నింగ్ ఇచ్చారు.ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ…….
కాలం చెల్లిన కొంతమంది అరాచకాలు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘటనలతో అభివృద్ధి ఆగిపోతుంది వ్యక్తిగత ఎదుగుదల చూడలేక ఇలాంటి పిరికి చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణానికి అభిమానులు సహకరించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కోరారు. కాగా టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యపై ఆయన అనుచరులు భగ్గుమన్నారు. తెల్దార్‌పల్లిలో సీపీఎం దిమ్మెలు ధ్వంసం చేశారు. తెల్దార్‌పల్లిలో 144 సెక్ష న్ విధించారు పోలీసులు. అటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీపీ విష్ణు. ఈ హత్య కేసుపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.