Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు స్వాతంత్ర్య ఉద్యమ సూర్తితో ఉద్యమిద్దాం…సీపీఎం ఖమ్మం జిల్లాకార్యదర్శి నున్నా

76 వ స్వాతంత్ర్యదినోత్సవాలలో మాట్లాడుతున్న నున్నా

లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు
స్వాతంత్రోద్యమ స్పూర్తితో ఉద్యమిద్దాం!

సిపిఎం ఖమ్మం జిల్లా కార్యాలయం వద్ద 76వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా పతాకావిష్కరణ చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, ఆగస్ట్‌ 15: స్వాతంత్య్రం పొందిన 75 సంవత్సరాల తరువాత కూడా మతం పేరుతో దాడులు, మత విద్వేష ప్రసంగాలు చోటు చేసుకోవడం సరైంది కాదని, మత సామరస్యం, లౌకికవాదంతోనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంతుందని, లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు, లౌకికవాదం పునాదులు బలోపేతం చేయడానికి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం నగరంలోని సిపిఎం జిల్లా ఆఫీస్‌ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో నున్నా మాట్లాడుతూ దేశం యావత్తూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకొంటోందని, స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు కాని వారు చరిత్రను వక్రీకరిస్తున్నారని, స్వతంత్ర పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను, ఘనమైన స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని నేటి తరాలకు తెలియజేయడానికి కృషి చేయాలని, మతోన్మాద శక్తుల కుట్రలను బహిర్గతం చేయాలని కోరారు. స్వాతంత్ర పోరాటానికి వెన్నుపోటు పొడిచి, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసిన వారే, నేడు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో మతసామరస్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయని, వాటి రక్షణ కోసం ప్రజాస్వామిక పద్ధతులలో ఉద్యమాలు నిర్వహించాలని, మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న మతోన్మాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని చీలిక చేసి కార్పొరేటు శక్తులను ప్రొత్సహిస్తుందని తెలిపారు. బిజెపి పాలనలో ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రజల మీద భారం మోపుతుందని అన్నారు. అంతే కాకుండా నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారాలు వేస్తుందని విమర్శించారు. మతోన్మాదాన్ని ఎదుర్కొని ప్రజలను రక్షించాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేష్‌, వై.విక్రం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్‌, మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్‌, బండి పద్మ, పి.రaాన్సీ, ఆర్‌.ప్రకాష్‌, పి.రమ్య, యస్‌.కె.బషీరుద్దీన్‌, నాయకులు కె.దేవేంద్ర, కోదాటి గిరి, వై.శ్రీనివాసరావు, రామారావు, మెరుగు రమణ, భాగం అజిత, శ్రీదేవి, పి.ఆర్‌.దేవి, గోపాల కృష్ణ, కె.మల్లిక, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమం వైపు సంఘం దృష్టిపెట్టాలి…

Drukpadam

ఇంగ్లండ్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఎమర్జెన్సీ ప్రకటన!

Drukpadam

100 కోట్లు,దొంగ ఓట్లు … పల్లా విజయమన్న మల్లన్న

Drukpadam

Leave a Comment