Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడు ఎన్నిక నేపథ్యంలో ఆశక్తిగా మారిన తెలంగాణ రాజకీయాలు…

మునుగోడు ఎన్నిక నేపథ్యంలో ఆశక్తిగా మారిన తెలంగాణ రాజకీయాలు
-దుబ్బాక , హుజురాబాద్ ఎన్నికలకు దీనికి పొంతన లేదంటున్న పరిశీలకులు
-రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఎన్నిక తెచ్చారని విమర్శలు
-కాంగ్రెస్ బలహీనపడ్డ ఇప్పటికి గణనీయమైన ఓటింగ్ శాతం ఉందంటున్న విశ్లేషకులు

2023 లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను అధికార టీఆర్ యస్ తో పటు ఇటు బీజేపీ ,అటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకన్న ముందు మునుగోడు ఉపఎన్నిక వచ్చి చేరడంతో రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి . అయితే గతంలో రాష్ట్రంలో జరిగిన దుబ్బాక , హుజురాబాద్ , నాగార్జున సాగర్ ఉపఎన్నికలకు దీనికి ఈమాత్రం పొంతనలేదు . గతంలో జరిగిన ఎన్నికలు అక్కడ ఎమ్మెలేలు మృతిచెందగా జరిగినవి . కానీ మునుగోడు ఎన్నిక ప్రత్యేకం . ఇక్కడ ఎన్నిక కొని తెచ్చుకున్నది . అంతకంటే కూడా బీజేపీ ప్రలోభాలకు లోనై కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి జైకొట్టి నందునే ఎన్నిక వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. ఆయన్నీ ఎవరు పార్టీ నుంచి పంపలేదు . పైగా ఉండమని బ్రతిమిలాడారు . అయితే రాజగోపాల్కు 23 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు ఇచ్చినందునే ఆయన బీజేపీలో చేరారని విమర్శలు మూటగట్టుకుంటున్నారు .

గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ లో ఉంటున్నప్పటికీ పార్టీ విధానాలపై తరుచు విబేదిస్తూనే ఉన్నారు . పార్టీ లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు .మరో 6 గురు మాత్రమే పార్టీ లో ఉన్నారు .వారిలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకోగా సంగారెడ్డి ఎమ్మెల్యేల జగ్గారెడ్డి ఎప్పుడు ఏమి చేస్తారో అనే సందేహాలు లేకపోలేదు. అటు పార్టీ ఇటు శాసన సభాపక్షం రాష్ట్రంలో బలహీన పడ్డాయి . ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు బలహీన పడటంతో రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిరస్థానం కోసం బీజేపీ ఎత్తులు వేస్తుంది .అన్ని పార్టీల్లో ఉన్న ప్రజాబలం కలిగిన నాయకులను తమవైపు తుప్పుకునేందుకు గాలం వేస్తుంది. అందుకు ప్రత్యేక టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది.

కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డప్పటికీ ఇంకా బలమైన ఓటింగ్ శాతం కలిగి ఉంది .బీజేపీ కి 2018 అసెంబ్లీ , 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 6 శాతం మించి రాలేదు . కాంగ్రెస్ ఇప్పటికి 25 శాతం ఓటింగ్ శాతం కలిగిఉంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న అధికార టీఆర్ యస్ రెండు,మూడు సంవత్సరాలుగా కేంద్ర సర్కారుపై ఒంటికాలుతో లేస్తుంది. అందువల్ల గత ఎన్నికల లాగా ఈ ఎన్నికలు ఉండకపోవచ్చు . రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ లోకి ఏ ఏ పార్టీల నుంచి ఎంతమంది వెళ్లనున్నారు అనేదానిపై రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే బీజేపీపై వస్తే ప్రజలకు కలిగే లాభమేమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏమిటని కూడా ప్రజలు ఆరాతీస్తున్నారు . మునుగోడులో గెలుపు ద్వారా తెలంగాణ లో అధికారం దిశగా అడుగులు వేయాలని బీజేపీ అగ్రనాయకత్వం చూస్తుంది. బీజేపీని మునుగోడులో రాకుండా చేయడంద్వారా తెలంగాణాలో బీజేపీకి చోటులేదని స్పష్టం చేయాలనీ అధికార టీఆర్ యస్ గట్టిపట్టుదలతో ఉంది. అందుకు వామపక్షాల మద్దతు కోరుతుంది. వారుకూడా అందుకు సుముఖంగా ఉన్నారు .దీంతో రాష్ట్ర రాజకీయాలు ఆశక్తిగా మారాయి

Related posts

స్వంత పార్టీ పై సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చురకలు …

Drukpadam

ఓటర్లకు డబ్బులుకూడా ఇస్తాం …ఎమ్మెల్యే రాములు నాయక్…

Drukpadam

రంకెలు వేస్తున్న నాయకులూ ఉద్రిక్తతల మధ్య సాగర్ సమరం…

Drukpadam

Leave a Comment