Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ అభ్యర్థి మతంపై బీజేపీ అభ్యంతరం …

తిరుపతి వైసీపీ అభ్యర్థి పోటీకి అనర్హుడు.. కోర్టుకెళతాం: సునీల్ దేవధర్
ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదు
నామినేషన్‌కు ముందు పాస్టర్ ఆశీర్వాదం తీసుకున్నారు
తనను అవహేళన చేసిన మంత్రి నానిపై ఫైర్
బీజేపీ తిరుపతి లో వైసీపీ ని దెబ్బతీసేందుకు దారులు వెతుకుంటుంది. వైకాపా అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మతంపై బీజేపీ రాద్ధాంతం  అభ్యంతరాలు వ్యక్తంచేస్తుంది. పోటీచేస్తున్న అభ్యర్థి ఎస్సీ అయినప్పటికీ ఆయన మతం మారినందున ఎస్సీగా ఎలా గుర్తిస్తారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తుంది.దీనిపై తాము కోర్ట్ కు వెళతామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్ అనగా బీజేపీ ఎంపీ రాష్ట్రానికి చెందిన జి.వి ఎల్ నరసింహారావు వైకాపా అభ్యర్థి హిందువా కదా స్పష్టం చేయాలనీ డిమాండ్ చేశారు.
ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదని, కాబట్టి తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ తరపున బరిలోకి దిగిన గురుమూర్తి అభ్యర్థిత్వం చెల్లదని బీజేపీ ఏపీ సహ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ కోర్టుకెళతామని అన్నారు. నిన్న తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, గురుమూర్తి ఇప్పటి వరకు తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదన్నారు.

నామినేషన్ వేసేముందు ఆయన ఓ పాస్టర్ ఆశీర్వాదం తీసుకున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆ తర్వాత తొలగించారని అన్నారు. గురుమూర్తి మతం మారిన విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నోరెందుకు మెదపడం లేదని దేవధర్ ప్రశ్నించారు. గోవిందనామాలు పెట్టుకున్న తనను మంత్రి పేర్ని నాని అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి నామాలు డ్రామాలాగా కనిపిస్తున్నాయా? అని మండిపడ్డారు.


 

వైసీపీ అభ్యర్థి గురుమూర్తి  హిందువా? కాదా? స్పష్టంగా చెప్పాలని జీవీఎల్  డిమాండ్


గురుమూర్తి చర్చికెళ్లి బిషప్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు

తిరుపతి నుంచి పోటీ చేసే అర్హత ఆయనకు లేదు
తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతోంది
తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడుతోంది. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, గురుమూర్తి హిందువా? కాదా? స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగంలోని షెడ్యూల్ కాస్ట్ 1950 ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలను కాకుండా అన్యమత ధర్మాలను పాటించే షెడ్యూల్ కులాల వారిని ఎస్సీలుగా పరిగణించరని అన్నారు. గురుమూర్తి గూడూరులోని చర్చికి వెళ్లి బిషప్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారని చెప్పారు. అందువల్ల రిజర్వుడు స్థానమైన తిరుపతి నుంచి పోటీ చేసే అర్హత గురుమూర్తికి లేదని అన్నారు.

గురుమూర్తి హిందూ ధర్మాన్ని పాటించరా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ఒకవేళ హిందూ ధర్మాన్ని పాటిస్తే.. వారి నాయకుడికి నచ్చదనే ఉద్దేశంతో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేదా? అని అడిగారు. గురుమూర్తి విషయాన్ని రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దేవుడి పేరుతో కరపత్రాలను ముద్రించి వైసీపీ ప్రచారం చేస్తోందని… ముఖ్యమంత్రి జగన్ దీనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. తిరుపతిలో అన్యమత ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోందని అన్నారు.

Related posts

ఈటల నీ నిర్ణయం సమర్ధనీయం కాదు: తమ్మినేని…..

Drukpadam

రాజన్న బిడ్డ మీ ముందుకు వచ్చింది… మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ

Drukpadam

అసెంబ్లీ స్పీకర్ పోచారం ఒక కీలుబొమ్మ: ఈటల రాజేందర్!

Drukpadam

Leave a Comment