Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్ట్ సంఘాల నేతలు!

ఎన్వీ రమణను కలిసి….
కృతజ్ఞతలు తెలిపిన టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు
-సంతోషం వ్యక్తం చేసిన మాజీ సీజే
హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్
కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయుడబ్ల్యుజె).
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) నాయకులు కలిసి హైదరాబాద్ జర్నలిస్టుల పక్షనా కృతజ్ఞతలు తెలిపారు.

శనివారం నాడు ఎన్వీ రమణని ఢిల్లీ లోని క్రిష్ణ మీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు కలుసుకొని కృతజ్ఞతలు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి వెళ్లాలని కోరారు. అంతేకాకుండా ఇవ్వాళ ఎన్వీ రమణ జన్మదినం కావడంతో టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

మాజీ సీజేఐ ఎన్వీ రమణను కలిసిన తెలంగాణ మీడియా ఛైర్మన్ అల్లం నారాయణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సానుకూల తీర్పును వెలువరించిన జస్టిస్ ఎన్వీ రమణ
ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టు సంఘాల నేతలు
జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వైనం

 

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జర్నలిస్ట్ సంఘాల నేతలు కలుసుకున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన వీరు ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఆయనను సత్కరించారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో రెండు రోజుల క్రితం సానుకూల తీర్పును ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా అల్లం నారాయణతో పాటు జర్నలిస్టు సంఘాల నేతలతో జస్టిస్ ఎన్వీ రమణ పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ‘కొలిమి అంటుకున్నది’ అనే పుస్తకం గురించి కూడా ప్రస్తావించారు. మరోవైపు జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, ఢిల్లీ టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.

Related posts

మోదీ, అమిత్ షా మూడో కన్ను తెరిస్తే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బాపూరావు

Drukpadam

తెలంగాణలో కుండపోత వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు…

Drukpadam

ఆఫ్ఘన్ల సాయుధ పోరాటం: 4 జిల్లాలు తాలిబన్ల నుంచి తిరిగి స్వాధీనం!

Drukpadam

Leave a Comment