Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్​ రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్​!

కేసీఆర్​ రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్​!

  • రైతులకు నష్టం కలిగించేలా టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఫైర్
  • కేసీఆర్ తీరుతో నల్లగొండ జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయమని మండిపాటు
  • 246 జీవో రద్దు చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటన

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు పడ్డారు . అయితే ఆయన చర్యలు అటు క్యాడర్ కు ఇటు లీడర్స్ కు అంతుచిక్కకుండా ఉన్నాయి. నేను కాంగ్రెస్ అంటూనే కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా విమర్శలు చేస్తారు . టీపీసీసీ నుంచి కూడా ఆయనకు దక్కాల్సిన మర్యాద దక్కడంలేదనే అభిప్రాయాలూ ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ,రాష్ట్ర వ్యహారాలు ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయనే విషయం అందరికి తెలిసిందే .మునుగోడుకు రాజీనామా చేసిన తన సొంతతమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచుకున్నాడు . దీంతో వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళతాడని ప్రచారం ఉంది . ఆయన మాత్రం తాను కాంగ్రెస్ ను వదలని అంటున్నాడు . ముందు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానన్న ఆయన ప్రియాంక గాంధీ తో సమావేశం అనంతరం కొంత మెత్తపడ్డట్లు కనిపించించాడు . కానీ కాంగ్రెస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది . మునుగోడు ఎన్నిక కాంగ్రెస్ కు అగ్ని పరీక్షగా మారింది.సీటింగ్ సీటు నిలుపుకోకపోతే అది రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పడి పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ పండితుల అభిప్రాయం.

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని.. ఆయన చర్యలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 246 తీసుకొచ్చిందని, దానివల్ల నల్లగొండ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మండిపడ్డారు.

ఇప్పటికీ అన్యాయమే..
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా నల్లగొండ జిల్లా రైతాంగానికి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. 1980లోనే నల్లగొండ ప్రజలకు ఎస్‌ఎల్‌ బీసీ ద్వారా 45 టీంఎసీలు కేటాయించారని గుర్తుచేశారు. అవి ఇప్పటికీ అందకపోగా, ఈ 45 టీఎంసీల నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం 246 జీవో తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చుపెడుతున్నారని పేర్కొన్నారు.

ఏపీ తరలిస్తున్నా పట్టించుకోరా?
కృష్ణా నది నుంచి ఏపీ సీఎం జగన్‌ రోజుకు 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీవో నంబర్‌ 246ను వెంటనే రద్దు చేయకపోతే దీక్ష చేస్తానని వెంకటరెడ్డి ప్రకటించారు.

Related posts

హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుంది: విద్యాసాగర్ రావు

Drukpadam

జగన్ బెయిలు రద్దయితే ఏమవుతుందో చెప్పిన సీపీఐ నారాయణ!

Drukpadam

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటౌతాయా ?

Drukpadam

Leave a Comment