Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఈ రోడ్ నాదే నేను కొన్నాను అని… అమరావతి రైతు రోడ్ ను తవ్వి కంకర తీసుకెళ్లిన వైనం

కొనుక్కున్నానంటూ రాజధాని రోడ్డును తవ్వేసి.. కంకరను ఎత్తుకెళ్లిన అమరావతి రైతు!

  • శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లేందుకు రోడ్డు వేసిన గత ప్రభుత్వం
  • కొనుక్కున్నానంటూ తవ్వేసిన పెనుమాక రైతు
  • విచారణ జరిపిన రెవెన్యూ అధికారి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్

ఏపీ లో అసలే రాజధాని విషయంలో స్పష్టత లేదు …చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధాని అని రైతుల వద్ద భూములు తీసుకోగా , 2019 అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల కోసం గట్టి పట్టుదలతో ఉంది. అయితే అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని జగన్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇక్కడ నుంచి రాజధాని తరలించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే .శాసనసభలో దీన్ని చట్టం చేసినప్పటికీ హైకోర్టు జోక్యంతో తాత్కాలికంగా ఆగిపోయింది. అయితే అక్కడ శాసన రాజధానితో పాటు మరికొన్ని సంస్థలు ఉంటాయని అధికార పార్టీ చెబుతుంది. ఈ నేపథ్యంలో పెనమకకు చెందిన రైతు రోడ్ తవ్వి కంకర తీసుకొని వెళ్లడం దుమారం రేపుతోంది.

అమరావతి రైతు ఒకరు రాజధాని రోడ్డును తవ్వేసి కంకరను తరలించుకుపోయాడు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లేందుకు గత ప్రభుత్వం ఓ కంకర రోడ్డు వేసింది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన రైతు గోవిందరెడ్డి ఆ రోడ్డును తవ్వేసి ట్రాక్టర్ల ద్వారా కంకరను తరలించాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు గురువారం విచారణ జరిపారు.

రెవెన్యూ ఆర్ఐ ప్రశాంతి సిబ్బందితో కలిసి తవ్వేసిన రోడ్డును పరిశీలించారు. అనంతరం రైతును కలిసి వివరణ తీసుకున్నారు. తాను ఆ పొలాన్ని కొనుగోలు చేశానని, అందుకనే చదును చేసుకున్నానని రైతు వివరణ ఇచ్చాడు. తరలించిన కంకరను గ్రామంలో ప్రజా అవసరాలకు వినియోగించినట్టు చెప్పుకొచ్చాడు. ఆయన వివరణతో నివేదిక తయారుచేసిన ఆర్ఐ ప్రశాంతి తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డికి దానిని అందజేశారు. రైతు గోవిందరెడ్డిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts

పోలీసులమంటూ దారి దోపిడీలు.. బెంగళూరులో ముగ్గురి అరెస్ట్!

Drukpadam

తీన్మార్ మల్లన్నకు రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!

Drukpadam

గంజాయి మత్తులో చిన్నారిపై హత్యాచారం!

Ram Narayana

Leave a Comment