Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేషన్ దుకాణం దగ్గర ప్రధాని ఫోటో లేకపోవడంపై కేంద్ర ఆర్ధికమంత్రి ఆగ్రహం !

అరగంట టైమ్ ఇస్తున్నా.. తెలుసుకుని చెప్పండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం

  • బిక్నూర్ లో రేషన్ షాప్ ను సందర్శించిన నిర్మల
  • ఫ్లెక్సీలో ప్రధాని ఫొటో లేకపోవడంతో కలెక్టర్ పై ఆగ్రహం
  • ఉచిత బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని ప్రశ్న
కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ అక్కడ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలంగాణాలో పర్యటిస్తున్న మంత్రి జిల్లాలోని ఒక రేషన్ షాప్ కు వెళ్లారు . అక్కడ ప్రధాని ఫోటో లేకపోవడంతో కలెక్టర్ కు ఫోన్ చేశారు . అంటే కాకుండా రేషన్ బియ్యంలో కేంద్రం ఇచ్చే వాటా చెప్పాలని అన్నారు . ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు . కేంద్ర ఇచ్చే వాటా తెలవాడని కలెక్టర్ చెప్పడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు . అరగంటలో తెలుసుకొని తనకు చెప్పాలని ఆదేశించారు .

తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. నేటి పర్యటన సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బిక్నూర్ లో రేషన్ షాపును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ పై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఉచిత రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంత? రాష్టం వాటా ఎంత? అని కలెక్టర్ ను నిర్మల ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. తెలియదని అన్నారు. దీంతో, ఆయనపై కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారి అయిన మీకు తెలియక పోవడం ఏమిటని కన్నెర్ర చేశారు. అరగంట సమయం ఇస్తున్నానని… తెలుసుకుని చెప్పాలని ఆదేశించారు.

అంతే కాదు, రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై కూడా నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ఇస్తోందని… అలాంటప్పుడు ప్రధాని ఫొటోను ఎందుకు ఉంచలేదని మండిపడ్డారు. రేషన్ షాపుల వద్ద మోదీ ఫొటో పెట్టాలని… లేకపోతే తానే వచ్చి పెడతానని హెచ్చరించారు.

Related posts

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి!

Drukpadam

చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు!

Drukpadam

లోకసభ లో దుమారం …లకింపుర్ ఘటన పెద్ద కుట్ర: రాహుల్ ధ్వజం

Drukpadam

Leave a Comment