Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడులో బీజేపీ అడుగుపెడితే మత కల్లోలాలే!

మునుగోడులో బీజేపీ అడుగుపెడితే మత కల్లోలాలే

టీఆర్ఎస్ పాలనతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్న ఉత్తమ్ 

ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శ 

బీజేపీ కార్పొరేటర్లకు దోచి పెడుతోందని కామెంట్ 

టీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు పెరిగిపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. బీజేపీ మతకలహాలు సృష్టిస్తోందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు.

కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ… రైతులను రోడ్డున పడేస్తోందని దుయ్యబట్టారు. ఏం అభివృద్ధి చేశారని బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజలను ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు. మునుగోడు ఓటర్లు చైతన్యవంతులని… విజ్ఞతతో ఓటేస్తారనే నమ్మకం తనకుందని చెప్పారు. మునుగోడులో బీజేపీ అడుగుపెడితే మత కల్లోలాలను సృష్టిస్తుందని అన్నారు. బీజేపీ యత్నాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని చెప్పారు.

Related posts

మణిపూర్ మండుతుంటే మోదీ 2 గంటలు టైమ్‌పాస్ చేశారు: రాహుల్ గాంధీ

Ram Narayana

ఫైజర్ ,మోడర్న్ లు తమ వ్యాక్సిన్లు నేరుగా అమ్మలేమని చెప్పాయి: కేజ్రీవాల్…

Drukpadam

మోడీ ,షా లకు కేటీఆర్ చురకలు…

Drukpadam

Leave a Comment