Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముగిసిన ద‌క్షిణాది రాష్ట్రాల జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం…

ముగిసిన ద‌క్షిణాది రాష్ట్రాల జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం…
గైర్హాజ‌రైన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు
తిరువ‌నంత‌పురం వేదిక‌గా స‌దస్సు
మొత్తంగా 26 అంశాల‌పై జ‌రిగిన చ‌ర్చ‌
9 అంశాల‌కు అక్క‌డిక‌క్క‌డే ల‌భించిన ప‌రిష్కారం

కారణాలు ఏవైనా ద‌క్షిణాది రాష్ట్రాల జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశనికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. జోనల్ స్థాయిలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాలమధ్య ఉన్న సమస్యలను ప్రధానంగా చర్చించి పరిస్కారం దిశగా ఆలోచనలు చేస్తారు . అయితే ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ,తెలంగాణ సీఎం సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం కొంత వెలితిగానే కనిపించింది.కేంద్రమంత్రి అమిత్ షా దీనికి హాజరైయ్యారు . కేరళ, తమిళనాడు , కర్ణాటక సీఎంలు హాజరైయ్యారు .

కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురం వేదిక‌గా ద‌క్షిణాది రాష్ట్రాల జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం శ‌నివారం సాయంత్రం ముగిసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌తన జ‌రిగిన ఈ స‌మావేశానికి కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్‌తో పాటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క సీఎంలు ఎంకే స్టాలిన్‌, బ‌స‌వ‌రాజ్ బొమ్మైలు హాజ‌ర‌య్యారు.

ఇక ఈ స‌మావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలు గైర్హాజ‌ర‌య్యారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ హాజ‌రు కాగా… ఏపీ నుంచి అధికారుల బృందం హాజ‌రైన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే… ద‌క్షిణాది రాష్ట్రాల మ‌ధ్య స‌హ‌కారం, వివాదాల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా సాగిన ఈ స‌మావేశంలో మొత్తంగా 26 అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. వీటిలో 9 అంశాల‌కు అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్కారం ల‌భించే దిశ‌గా చ‌ర్చ‌లు ఫ‌లించాయి. అదే స‌మ‌యంలో మిగిలిన 17 అంశాల‌పై మలి విడ‌త స‌మావేశంలో చ‌ర్చించ‌నున్న‌ట్లు అమిత్ షా తెలిపారు.

Related posts

ప్రజలకు కావాల్సింది మొసలి కన్నీరు కాదు.. టీకాలు: మోదీపై కాంగ్రెస్ ఫైర్!

Drukpadam

తన వేలు పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చానన్న ప్రధాని మోదీ కామెంట్లపై శరద్ పవార్ స్పందన ..

Drukpadam

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ ముఖ్య నేతలకు బీజేపీ గాలం?

Drukpadam

Leave a Comment