Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అక్కినేని నాగార్జున కనుసన్నల్లో బూతుల స్వర్గం: సీపీఐ నారాయణ ఫైర్

అక్కినేని నాగార్జున కనుసన్నల్లో బూతుల స్వర్గం: సీపీఐ నారాయణ ఫైర్
-అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ – 6
-సిగ్గు, యెగ్గు లేని జంతువులు ఏమైనా చేస్తాయన్న సీపీఐ నారాయణ
-కాసులకు కక్కుర్తి పడేవారు ఉన్నంత కాలం ఈ పాపాలకు ఆదరణ ఉంటుందని వ్యాఖ్య

బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్-6 అట్టహాసంగా ప్రారంభమయింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఈ షోను మరోసారి హోస్ట్ చేస్తున్నారు. కంటెస్టెంట్లు అందరూ హౌస్ లోకి అడుగుపెట్టారు. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు బరిలోకి దిగారు. మరోవైపు బిగ్ బాస్ షోను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముందు నుంచీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి బిగ్ బాస్ షోపై విరుచుకుపడ్డారు.

సిగ్గు, యెగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నాచెల్లెళ్లు కానోళ్లు, పిటపిటలాడే అందంతో ఉన్న ముక్కుముఖం తెలియని వాళ్లు… అచ్చోసిన ఆంబోతుల్లా అక్కినేని నాగార్జున కనుసన్నల్లో వంద రోజుల పాటు బూతుల స్వర్గంలో విలువైన సమయాన్ని వేస్ట్ చేసే బిగ్ బాస్ వచ్చేస్తోందని ఆయన మండిపడ్డారు.

సమాజానికి ఉపయోగపడాల్సిన యువత దేశ సంపద ఉత్పత్తకి ఉపయోగపడకుండా… బూతుల స్వర్గాన్ని ఉత్పత్తి చేస్తారా? అని సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షోలను సిగ్గులేని ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి చూస్తారని అన్నారు. ఈ షో నుంచి తమకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రేక్షకులు అడగాలని చెప్పారు.

పెళ్లాలను వదిలేసిన మొగుళ్లు, మొగుళ్లను వదిలేసిన పెళ్లాలు అచ్చోసిన ఆంబోతుల్లా జీవించండని సందేశం ఇస్తారేమో అని ఎద్దేవా చేశారు. కాసులకు కక్కుర్తిపడే సిగ్గులేని వ్యక్తులు ఉన్నంత కాలం ఈ పాపాలకు ఆదరణ ఉంటుందని, ద్రౌపదీ వస్త్రాపహరణం వర్ధిల్లుతూనే ఉంటుందని విమర్శించారు.

Related posts

లాక్‌డౌన్‌ ఊహాగానాలను పటాపంచలు చేసిన కేంద్రం!

Drukpadam

సీఎం కేసీఆర్ కు జ్వరం… మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే

Drukpadam

పవన్ కల్యాణ్ కు పెళ్లి కార్డు కూడా ఇచ్చాను… కానీ రాలేకపోయారు: అలీ

Drukpadam

Leave a Comment