Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రెండు రోజుల పాటు మూత పడ‌నున్న తిరుమ‌ల ఆల‌యం.. కార‌ణాలివే!

 

రెండు రోజుల పాటు మూత పడ‌నున్న తిరుమ‌ల ఆల‌యం.. కార‌ణాలివే!

  • అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఆల‌యం మూత‌
  • నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా మూత‌ప‌డ‌నున్న ఆల‌యం
  • ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసిన టీటీడీ

తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం రానున్న రెండు నెలల్లో రెండు రోజుల పాటు మూత‌ప‌డ‌నుంది. అక్టోబ‌ర్ నెల‌లో ఒక రోజు, నవంబ‌ర్ నెల‌లో మ‌రో రోజు ఆల‌యాన్ని మూసివేయ‌నున్న‌ట్లు టీటీడీ తెలిపింది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణ సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ బుధ‌వారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆల‌యాన్ని మూసివేయ‌నున్న‌ట్లు టీటీడీ ప్ర‌క‌టించింది. అదే మాదిరిగా నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది.

ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 దర్శనం), ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండు రోజుల పాటు గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి కేవలం సర్వదర్శన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.

 

తిరుమల కష్టాలు

 

తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబర్ , నవంబర్ నెలల్లో సూర్య , చంద్ర గ్రహణాలు కారణంగా రెండురోజులపాటు మూతపడుతుందని ఆలయ పరిపాలన అధికారులు తెలిపారు . కరోనా తర్వాత కలియుగ దైవంగా భావాయించే శ్రీ వేంకటేశ్వరస్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ముందుగానే దర్శన టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పటికీ గదులు దొరకటం దుర్లభంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రూమ్స్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిపై సామాన్యులు ఎవరికీ చెప్పుకోలేక అనేక కష్టాలు పడుతున్నారు.కొన్ని రూంలు వివిఐపి లకు మాత్రమే కేటాయించడం ,ఉన్న రూమ్స్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం పై కూడా విమర్శలు ఉన్నాయి. ఇక పాలకవర్గం సభ్యులు రెకమండేషన్ లలోకూడా ఇబ్బందులు తప్పడంలేదు. బోర్డు సభ్యుడు లెటర్ ఇచ్చిన అక్కడ ఉండే వారి సిబ్బంది దయలేకపోతే దర్శనం దొరకటం దుర్లభమే అవుతుంది. వైవి సుబ్బారెడ్డి చైర్మెన్ గా రెండవసారి నియమితులైయ్యారు . మొదటిసారి కొత్త అనుకున్న రెండవసారి కొంత అనుభవం వచ్చింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు , గదుల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటే హర్షిస్తారు లేకపోతె ఛీత్కరించుకుంటారు

Related posts

అన్యాక్రాంతం అయిన వక్ఫ్ భూములను వెనక్కు తీసుకోవాలి:భట్టి

Drukpadam

దేశ జనాభాతో సమ నిష్పత్తిలో పెరుగుతున్న ముస్లిం జనాభా…!

Drukpadam

పవన్ రాజకీయాలకు మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు…!

Ram Narayana

Leave a Comment