వచ్చే ఎన్నికల్లో పోటీపై సంచలన ప్రకటన చేసిన జగ్గారెడ్డి!
-సంగారెడ్డిలో తన అనుచరలతో భేటీ అయిన జగ్గారెడ్డి
-వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటన
-తన బదులుగా పార్టీ కార్యకర్తను బరిలోకి దించుతానని వెల్లడి
-కార్యకర్తలు వద్దంటే… తన భార్యను పోటీ చేయిస్తానని వివరణ
-2028 ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చెప్పిన సంగారెడ్డి ఎమ్మెల్యే
కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2024 ఎన్నికల్లో తాను పోటీచేయనని సంచలన ప్రకటన చేశారు . అయితే 2028 జరిగే ఎన్నికల్లో తన పోటీచేస్తానని ప్రకటించడం గమనార్హం . టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డికి సఖ్యత లేదు . దీంతో జగ్గారెడ్డి పార్టీ విడతారని ప్రచారం కూడా జరిగింది . కానీ అయినా నేరుగా రాహుల్ గాంధీని కలిసి వెనక్కు తగ్గారు .కొద్దికాలం తర్వాత తిరిగి టీపీసీసీ చీఫ్ తో గొడవలు మొదలైయ్యాయి . అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకున్నారు . సీఎల్పీ నేత భట్టి సైతం జగ్గారెడ్డి , రాజగోపాల్ రెడ్డి విషయంలో చాల ప్రయత్నాలు చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాట వినకుండా బీజేపీ లో చేరారు .
ఏడాదిన్నరలో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) బుధవారం సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. తన స్థానంలో సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తను బరిలోకి దించుతానని ఆయన మరో ఆసక్తికర ప్రకటన చేశారు.
తన భార్య నిర్మలతో కలిసి బుధవారం పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా జగ్గారెడ్డి ఈ ప్రకటన చేశారు. తనకు బదులుగా సంగారెడ్డికి చెందిన పార్టీ కార్యకర్తను బరిలోకి దించేందుకు పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోతే… తన స్థానంలో తన భార్య చేత పోటీ చేయిస్తానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పిన జగ్గారెడ్డి… 2028లో జరిగే ఎన్నికల్లో మాత్రం సంగారెడ్డి నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు.