వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సంచలన విషయాలు వెల్లడించిన ఏబీ వెంకటేశ్వరరావు
-ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు
-సీబీఐకి లేఖ రాసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
-హత్య జరిగి గంటలు గడిచినా లోపలికి రానివ్వలేదని ఆరోపణ
-కొందరు నేతలు అడ్డుకున్నారని వెల్లడి
-ఇల్లంతా ఎంపీ అవినాష్ రెడ్డి అధీనంలోనే ఉందని కామెంట్
-తాను చెప్పినా అప్పటి సి బి ఐ అధికారి ఎం ఎం సింగ్ సైతం తీసుకోలేదని వెల్లడి
-దోషులు ఎవరనేది తేలాలన్న విజయమ్మ ,ఆదినారాయణ రెడ్డి పై అనుమానాలు
-ఇంతకీ కట్టప్ప ఎవరంటున్న చంద్రబాబు
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఆయన సీబీఐకి లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన చాలా సేపటిదాకా పోలీసులను కొందరు ప్రజాప్రతినిధులు లోపలికి రానివ్వలేదని ఆరోపించారు.
పోలీసులను వారు కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. గుండెపోటుతో మరణించారని నమ్మించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారన్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన తర్వాత.. ఇల్లు కడగడం దగ్గర్నుంచి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేదాకా ఎంపీ అవినాష్ రెడ్డి తన అధీనంలోనే ఉంచుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఆ సమయంలో మీడియాను కానీ, ఇంటెలిజెన్స్ బృందాన్ని గానీ, పోలీసులను గానీ లోపలికి అనుమతించలేదని తెలిపారు. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా దర్యాప్తులో ఇంత వరకు పురోగతి లేదన్నారు. కేసు పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి ఎన్.ఎం.సింగ్ కు ఫోన్ చేసి చెప్పినా తీసుకోలేదని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. హత్య జరిగినప్పుడు తానే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నానని, అందుకే కావాలనే తనను విధుల నుంచి తొలగించి ఉంటారని అన్నారు.
దీనిపై వైసీపీ సందేహాలు వ్యక్తం చేస్తుంది. అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశానిది . ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు నే ఉన్నారు . ఎందుకు ఆయన చర్యలు తీసుకోలేదు చెప్పాలని అంటున్నారు. అప్పుడు చంద్రబాబుకు అత్యంత కీలక అధికారిగా పనిచేసిన ఏ బి వెంకటేశ్వరరావు కేసులో దోషులను బయట పెట్టి అరెస్ట్ ఎందుకు చేయలేదు . ఇప్పుడు తన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకే ప్రభుత్వంపై ప్రత్యేకంగా వైసీపీ పై ,ముఖ్యమంత్రి జగన్ పై వ్యతిరేకతతోనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.జగన్ తల్లి విజయమ్మ మాట్లాడుతూ ఈ కేసులో ఆశలు దోషులు ఎవరు అనేది చంద్రబాబుకు తెలుసు ఆప్పటిలో ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంటలిజన్స్ చీఫ్ గా ఏ బి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిపై అనుమానాలు ఉన్నాయని ,తనుకాని ,జగన్ గాని,షర్మిల గాని దోషులు ఎవరనేది తేలాలని కోరుకొంటున్నామని అన్నారు.
చంద్రబాబు సైతం వివేకానందరెడ్డి హత్య సి బి ఐ దర్యాప్తు పై స్పందించారు. సాక్షాలు అన్ని క్లియర్ గా ఉన్నాయి.సి బి ఐ దోషులు ఎవరనేది తేల్చాలి ఇది సిబిఐ కి సైతం ఛాలంజ్ అని ,కట్టప్ప ఎవరో తేలాలని అన్నారు.
ఈ కేసులో అసలు దోషులు తేలాలని ప్రజలు కూడా కోరుకొంటున్నారు.అందుకోసం ప్రజలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.