Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పువ్వాడ అజయ్ మంత్రిగా మూడేళ్లు …అభినందనల వెల్లువ!

పువ్వాడ అజయ్ మంత్రిగా మూడేళ్లు …అభినందనల వెల్లువ!
-శాలువాలతో సత్కరించిన నాయకులు, అభిమానులు..
-పేదల అభివృద్ది, సంక్షేమంతో మూడేళ్ళు పూర్తి చేసుకున్న మంత్రి పువ్వాడ..
-నిత్యం ప్రజల కోసమే. ప్రజలతోనే.. ప్రజల వద్దకే…
-అభివృద్ధిని కొత్తగా పరిచయం చేసిన మంత్రి పువ్వాడ..
-రవాణా మంత్రిగా మూడేళ్ళు పూర్తి చేసుకున్న పువ్వాడ

ఖమ్మం ఎమ్మెల్యే గా ఎన్నికైన టీఆర్ యస్ నాయకులూ పువ్వాడ అజయ్ కుమార్ కు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం లభించి మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా అధికారులు , ప్రజాప్రతినిధులు , ప్రజలు , మీడియా ప్రతినిధులు మంత్రిని అభినందనలతో ముంచెత్తారు .నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏసమస్య వచ్చినా నేనున్నానంటూ అభయమిచ్చిన పువ్వాడ అందుకు తగ్గట్లుగా అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించారు . మొదట్లో ప్రజలకు ఆయనకు కొంచెం గ్యాప్ ఉన్నట్లు అనిపించినా అనతికాలంలోనే దాన్ని అధిగమించి తన మార్క్ పరిపాలన అందించారు .

దీంతో ఆయన మంత్రిగా మూడేళ్ళ పాలనా సందర్భంగా గురువారం ఉదయం నుంచే ఖమ్మం మమతా హాస్పటల్ లో గల మంత్రి పువ్వాడ నివాసం అభిమానులు అధికారులు ,ప్రజాప్రతినిధులతో నిండిపోయింది. అక్కడ కొంతమందిని కలిసిన మంత్రి వీడీయోస్ కాలనిలో గల తన క్యాంపు కార్యాలయంలో అందరిని కలిశారు . అనేకమంది పూలబొకేలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు .

తాను అనుకున్న అభివృద్ధి పనులు చేయడంలో మంత్రి అజయ్ కు మంచి పేరుంది . ప్రత్యేకించి ఖమ్మం అభివృద్ధిలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు . ఎవరు ఎన్ని మాటలు అన్న లెక్క చేయకుండా ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత మంత్రికి దక్కింది .

పేదల అభ్యున్నతి కోసం సమాజానికి తనవంతుగా ఏదో చేయాలని తాపత్రయంతో గెలిచిన తనకు తెలంగాణ ప్రభుత్వం మంత్రిగా అధ్భుత అవకాశం ఇవ్వటం పట్ల దాన్ని పేదల సంక్షేమానికోసం ఉపయోగించేందుకు నిత్యం ఆరటపడ్డారు.

గెలిచిన తొలి రోజు నుండి అభివృద్ది, సంక్షేమం తోనే మూడేళ్ళు పూర్తి చేసుకున్నారు.
నిత్యం ప్రజల కోసం.. ప్రజలతోనే.. ప్రజల వద్దకే… పాలన తీసుకెళ్ళి నూతన ఒరవడి సృష్టించాలని ఎంతో యోచన చేసి అనేక కార్యక్రమాలు రూపొందించారు.

ఎమ్మెల్యేగా గేలిచిన తోలి నాళ్ళలో ఖమ్మం కార్పొరేషన్లలో కేవలం 12వేల మందికి మాత్రమే పెన్షన్ లు వచ్చేవి.. శరవేగంగా విస్తరిస్తున్న ఖమ్మంలో ఎందరో అర్హులైన పేదలకు పెన్షన్ రాని వారు అప్పటి ఎమ్మేల్యే పువ్వాడ ఇంటి ముందు వందల మంది పడిగాపులు కాచి.. తమకు ప్రభుత్వం నుండి పెన్షన్ ఇప్పించాలని విజ్ఞప్తుల వెల్లువలు కురిపించారు.

స్పందించిన పువ్వాడ. కేవలం నా ఇంటి ముందు ఉన్న వారికి మాత్రమే కాదు నిజంగా అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వాలని సంకల్పించారు. హుటాహుటిన ఆయా పేదలను వెంటవేసుకుని అధికారులను కలిసి సమస్యను విన్నవించారు.

స్పందించకపోవడంతో జిల్లా కలెక్టరేట్ నందు నిరాహార దీక్షకు దిగారు. దీంతో ఖమ్మం ప్రజలు పువ్వాడ అజయ్ కుమార్  వెనున నిలబడ్డారు. తమకు పువ్వాడ వల్లే న్యాయం జరుగుతుంది అని బలంగా నమ్మారు.. వెంట నడిచారు..

విషయం హైదరాబాద్ చేరి ఆయా సమస్యను పరిష్కరించాలని నాటి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు రావడంతో ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేశారు. అప్పటి వరకు ఖమ్మం లో 12 వేలు పెన్షన్ లు ఉండగా పువ్వాడ దీక్ష వల్ల మరో 10వేల మంది అర్హులైన పేదలు లబ్ధి పొందారు.

అదే పెన్షన్ లు ఇపుడు మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో మరో 7వేలు పెరిగి మొత్తం దాదాపు 30 వేలు ఒక్క ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయంటే అతిశయొక్తి కాదు..

ఖమ్మం కార్పొరేషన్ దుస్థితిని, గతి ని మార్చాలని ఉదయమే సైకిల్ ఎక్కి వాడ వాడల తిరిగి, ప్రజలకు కావలసింది ఎంటి.. ఇంకా ఏమి చెయ్యాలి అని స్వయంగా తెలుసుకునేందుకు సైకిల్ పై తిరుగుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ప్రజలకు అందాల్సిన
సౌకర్యాలు, సేవలను అందేలా చేశారు.

కనీస సౌకర్యాలైన త్రాగునీరు, రొడ్లు, అంతరాయం లేని విద్యుత్, మురుగు కాల్వలు ఇతర సమస్యలను పరిష్కరించారు.

సామాన్యులు తమ ఆడబిడ్డలకు పెళ్లి చేసి అప్పులపాల అవ్వకుండా ఉండాలని ప్రభుత్వం సంకల్పించిన దరిమిలా కల్యాణలక్ష్మి, షాది ముభరక్ ద్వారా రూ.లక్ష ఇచ్చింది. దానిలో ఎలాటి తప్పులు దొర్లకుండా, మధ్యవర్తులు లేకుండా చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలతో అర్హులైన ప్రతి పేదవాడికి ఈ పథకాన్ని మంజూరు చేసేలా చర్యలు తీసుకుని, మంజూరైన చెక్కులను తానే స్వయంగా మోటార్ సైకిల్ పై వెళ్లి లబ్ధిదారుల ఇంటి వద్దే చెక్కులు ఇచ్చిన గుర్తులు ఖమ్మం ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు.

మంత్రి పువ్వాడ ప్రయత్నం చూసి యావత్ రాష్ట్రం మొత్తం అనుసరించడం ప్రారంబించింది. అనేక నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మేల్యేలు అనుసరించాల్సి వచ్చిన పరిస్థితులు చూస్తున్నాం.

ఖమ్మం ప్రజలకు అభివృద్ధిని కొత్తగా పరిచయం చేసిన చూపించిన ఘనత మంత్రి పువ్వాడ సొంతం.

రవాణా మంత్రిగా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా ఆత్మీయంగా శాలువాలతో సత్కరించిన నాయకులు, అభిమానులు..

రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మూడేళ్ళు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఖమ్మం VDO ‘s కాలనీ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పలువురు అభినందనలు తెలిపారు.

పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేరు వేరు గా ఏర్పాటు చేసిన కేక్ లను కట్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ కు పలు శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు శాలువాలు, పుష్పగుచ్చంలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు.

అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్  కాబినెట్ లో పని చేయడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. కోట్లాది సాధించుకున్న తెలంగాణ ను అన్ని రంగాల్లో ముందుంచేందుకు ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్  చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు.

రాష్ట్ర ప్రగతిలో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు వారికి నేను రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

నాపై నమ్మకం ఉంచి నాకు కేటాయించిన రవాణా సంస్థ(ఆర్టీసీ), రవాణా శాఖలు తనకు రెండు కళ్ల లాంటివని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కీలకమైన ఈ రెండు రంగాలను అందరి సహాయ సహకారాలతో ప్రజలకు మరింత చేరువ చేయడానికి పలు సంస్కరణలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

Related posts

విప‌క్ష నేత‌ల‌కు జేపీ న‌డ్దా ఫోన్‌… ముర్మును ఏక‌గ్రీవంగా ఎన్నుకుందామ‌ని పిలుపు!

Drukpadam

2024లో బీజేపీ ఓడిపోతుంది: సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి!

Drukpadam

మంత్రి పదవినుంచి నన్ను తప్పించాలనే చంద్రబాబు పన్నాగం …కొడాలి నాని

Drukpadam

Leave a Comment