Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై భగ్గుమంటున్న తల్లిదండ్రులు!

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై భగ్గుమంటున్న తల్లిదండ్రులు!
-విద్యార్థినులతో కలిసి డ్యాన్సులు చేసిన యూనివర్శిటీ వీసీ..
-మండిపడుతున్న విద్యార్థి సంఘాలు
-నిన్న వినాయక నిమజ్జనం తర్వాత గర్ల్స్ హాస్టల్ వద్దకు వెళ్లిన రవీందర్ గుప్తా
-డ్యాన్సులు చేసి, డబ్బులు పంచిన వైనం
-వీసీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల డిమాండ్

చదువులు , విద్యాబుద్ధులు నేర్పాల్సిన విసి నిమజ్జనం తర్వాత బాలికల హాస్టల్ కు వెళ్లి వారితో కలిసి డాన్సులు వేయడమే కాకుండా , వారికీ డబ్బులు ఇచ్చాడని వస్తున్నా ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉండగా , తల్లిదండ్రులు , విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. విసి చర్యలపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. సభ్యసమాజం విసి చర్యలను తప్పుపడుతుంది.

తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్ గుప్తాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చేసిన నిర్వాకంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే… నిన్న వినాయక నిమజ్జనం తర్వాత గర్ల్స్ హాస్టల్ వద్దకు వెళ్లిన రవీందర్ గుప్తా హాస్టల్ లో డ్యాన్సులు చేశారు. అనుమతులు లేకపోయినప్పటికీ మరో ఇద్దరు వ్యక్తులతో అక్కడకు వెళ్లి ఆయన డ్యాన్సులు చేశారు.

అంతేకాదు, డబ్బులు కూడా పంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూనివర్శిటీకి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి… విద్యార్థినులతో కలిసి ఇలా డ్యాన్సులు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రవీందర్ గుప్తాపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దంటూ పిటిషన్లు…

Drukpadam

ఆఫ్ఘన్‌ సంక్షోభం: ఐక్యరాజ్య సమితి పిలుపుతో బిలియన్ డాలర్ల సాయం!

Drukpadam

టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్

Drukpadam

Leave a Comment