Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జాతీయ పార్టీ కోసం మూడు పేర్లను పరిశీలిస్తున్న కేసీఆర్!

జాతీయ పార్టీ కోసం మూడు పేర్లను పరిశీలిస్తున్న కేసీఆర్!
-జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్
-జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరమంటున్న టీఎస్ సీఎం
-కేసీఆర్ ను కలిసేందుకు రేపు హైదరాబాద్ కు వస్తున్న కుమారస్వామి

కేసీఆర్ జాతీయ పార్టీ కోసం వడివడిగా అడుగులు వేస్తున్నురు . కేంద్రంపై నిత్యం పోరాటం చేస్తూ , విమర్శలు గుప్పిస్తున్న కేసీఆర్ జాతీయపార్టీకి ఆదరణ ఎలా ఉంటుంది. ఏ ఏ రాష్ట్రాలు కలిసి వస్తాయి అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో టీఆర్ యస్ ది లేదా కేసీఆర్ ది పరిమిత పాత్ర …తెలంగాణాలో తప్ప ఏ రాష్ట్రంలో టీఆర్ యస్ ఉనికి కూడా లేదు . అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు . ప్రధానంగా బీజేపీయేతర రాష్ట్రాల సీఎం లతో సమావేశాలు జరుపుతున్నారు . ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారు . అయితే జాతీయ స్థాయిలో బీజేపీ ని గద్దె దించాలని ఉన్న కేసీఆర్ పార్టీలో తమ పార్టీలను విలీనం చేసేందుకు ఏ ప్రాంతీయ పార్టీ సిద్ధంగా లేదు . మరి కేసీఆర్ జాతీయ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఆలోచనలు వేరు ఆచరణ వేరుగా ఉంటుంది. కేసీఆర్ జాతీయ స్థాయిలో పెట్టబోయే పార్టీ పేరు పై కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. కొంతకాలంగా ఆయన కేంద్రంలోని బీజేపీ వ్యవహారశైలిపై, పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ పాలనలో దేశం నాశనమైపోయిందని ఆయన మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరమని చాలా కాలంగా చెపుతున్న కేసీఆర్ చివరకు జాతీయ పార్టీని స్థాపించడానికి సిద్ధమయ్యారు. జాతీయ పార్టీకి సంబంధించి అధికార ప్రకటనకు కౌంట్ డౌన్ కూడా ప్రారంభమయింది.

మరోవైపు, జాతీయ పార్టీకి మూడు పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి, భారత నిర్మాణ సమితి, భారత ప్రజా సమితి పేర్లను ఆయన పరిశీలిస్తున్నారు. వీటిలో ఒక పేరును ఆయన ఖరారు చేయనున్నారు. జాతీయ రాజకీయాల్లో భాగంగా ఇటీవలే బీహార్ కు వెళ్లి సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లను ఆయన కలిసిన సంగతి తెలిసిందే. మరోవైపు, కేసీఆర్ ను కలిసేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రేపు హైదరాబాద్ కు వస్తున్నారు.

Related posts

ప్రియాంక గాంధీ కార్యదర్శికి లంచం ఇవ్వలేకపోయా.. అందుకే టికెట్ రాలేదు: ప్రియాంక మౌర్య!

Drukpadam

లోక్‌స‌భ‌లో గంద‌ర‌గోళం.. వాయిదా

Drukpadam

సీఎం కేసీఆర్ కు జ్వరం …ప్రధాని మోడీ పర్యటనకు దూరం!

Drukpadam

Leave a Comment