Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికా దేశంలో ఒక గ్రామం అంతా ఒకే భవనంలో… పెరుగుతున్న సందర్శకుల తాకిడి !

ఊరంతా ఒక్క బిల్డింగ్ లోనే.. ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ అందులోనే.. చిత్రమైన ఊరు !

  • అమెరికాలోని అలస్కా ప్రాంతంలో ఉన్న ఆ గ్రామం పేరు విట్టియర్‌
  • మొత్తం జనాభా 200.. అందులో 180 మంది ఒక్క 14 అంతస్తుల భవనంలోనే నివాసం
  • అందులోనే షాపింగ్‌ మాల్‌.. పోస్టాఫీసు, పోలీస్‌ స్టేషన్‌
  • బయటి నుంచి వచ్చే టూరిస్టులకూ అదే భవనంలో బస

ఊరంటే ఎన్నో కొన్ని ఇళ్లు, దుకాణాలు, స్కూలు ఇలా ఎన్నో ఉంటాయి. మరిన్ని మౌలిక సదుపాయాలూ ఉంటాయి. కానీ ఓ ఊరు మాత్రం అన్నింటికన్నా చాలా చిత్రంగా ఉంటుంది. వందల్లో జనం ఉంటారు.. పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆస్పత్రి దాకా అన్ని సదుపాయాలూ ఉంటాయి. కానీ అన్నీ ఒక్క చోటే ఉంటాయి. ఒక్క చోట అంటే.. పక్కపక్కనో, ఎదురెదురుగానో కాదు.. అంతా ఒకే ఒక్క భవనంలో ఉంటాయి. ఇదేదో సరదాకి చెబుతున్నది కాదు. నిజమే. అమెరికాలోని అలాస్కాలో ఉన్న ఆ గ్రామం పేరు విట్టియర్‌.

నిత్యం మంచుతో కప్పబడి..
నిత్యం మంచుతో కప్పబడి ఉండే అలాస్కాలోని అంకోరేజ్‌ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో విట్టియర్‌ గ్రామం ఉంటుంది. ఇక్కడ మొత్తం జనాభా 200 అయితే అందులో 180 మంది ఒక్క 14 అంతస్తుల భవనంలోనే నివాసం ఉంటున్నారు. ఆ భవనం పేరు బిగిచ్‌ టవర్స్‌. ఒకప్పుడు ఆర్మీకి చెందినది. చుట్టుపక్కల ఇళ్లు ఉన్నా.. వాటిలో ఉండేది అతి తక్కువ మందే.

  • ఇదంతా ఎందుకూ అంటే.. ఇక్కడ నిరంతరం మంచుతోనే కప్పబడి ఉంటుంది. ప్రజలందరికీ వేర్వేరుగా వేడి సౌకర్యాలు కల్పించడం, రక్షణ సమస్య అని.. ప్రభుత్వం అందరినీ ఒకే భవనంలోకి మార్పించింది.
  • విట్టియర్‌లోని బిగిచ్‌ టవర్స్‌ లోనే చిన్న షాపింగ్‌ మాల్‌, పోస్టాఫీసు, పోలీస్‌ స్టేషన్‌, ఆస్పత్రి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే టూరిస్టులకు ఇదే భవనంలో బస ఏర్పాట్లు ఉంటాయి.
  • ఈ ఊరిలోని బడి మాత్రం భవనంలో లేదు. బయట ఉంటుంది. పిల్లలు స్కూలుకు వెళ్లిరావడం కోసం భవనం నుంచి స్కూల్‌ వరకు ఒక సొరంగం (అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌) ఉంటుంది.
  • ఇన్ని చిత్రమైన అంశాలు ఉండటంతో ఇటీవల ఈ ఊరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పర్యాటకుల సంఖ్య పెరిగింది. వారి కోసం హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మొదలయ్యాయి.
  • అసలు ఈ గ్రామానికి వెళ్లాలంటే కొండల మధ్య ఘాట్‌ రోడ్లు, టన్నెళ్ల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుందని.. అది చాలా ప్రమాదకరమని పర్యాటకులు చెబుతున్నారు.

Related posts

గ్రేటర్ హైదరాబాదులో ఇక సాధారణ ప్రయాణికులకూ రూట్ పాస్

Drukpadam

విప‌క్ష నేత అఖిలేశ్‌ ఇంట సీఎం ఆదిత్య‌నాథ్‌!

Drukpadam

విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు : కేటీఆర్

Drukpadam

Leave a Comment