Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం?

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం?

  • పుతిన్ పై హత్యాయత్నం జరిగిందంటూ వార్తలు
  • భారీ శబ్దంతో పేలిపోయిన పుతిన్ ప్రయాణిస్తున్న వాహనం చక్రం
  • మరో బ్యాకప్ కాన్వాయ్ లో సురక్షితంగా తరలింపు

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరోసారి హత్యాయత్నం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. పుతిన్ ప్రయాణిస్తున్న వాహనంపై బాంబు దాడి జరిగినట్టు… అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్టు యూరో వీక్లీ న్యూస్ అనే మీడియా సంస్థ వెల్లడించింది. జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానల్ ఈ విషయాన్ని ప్రకటించిందని తెలిపింది.

పుతిన్ తన నివాసానికి తిరిగొస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ముందువైపు ఎడమ చక్రం భారీ శబ్దంతో పేలిందని వెల్లడించింది. వాహనం నుంచి పొగలు వస్తున్నప్పటికీ… భద్రతా సిబ్బంది ఆయన వాహనాన్ని అక్కడి నుంచి సురక్షితంగా తరలించిందని తెలిపింది. మరో బ్యాకప్ కాన్వాయ్ లో ఆయనను అధ్యక్ష భవనానికి తరలించారని పేర్కొంది. ఈ ఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయని తెలిపింది.

మరోవైపు కొన్ని నెలల  క్రితం కూడా పుతిన్ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఈ విషయాన్ని రష్యా రహస్యంగా ఉంచిందని పేర్కొంది. ఇంకోవైపు 2017లో పుతిన్ మాట్లాడుతూ… తనపై ఇప్పటి వరకు ఐదు సార్లు హత్యాయత్నాలు జరిగాయని… అయినా తాను ఆందోళన చెందబోనని చెప్పారు.

Related posts

జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ.. వివాహేతర బంధమే కారణం!

Ram Narayana

ఉత్తరప్రదేశ్ లో జ‌ర్న‌లిస్టుపై ఐఏఎస్ అధికారి దాడి.. వీడియో వైర‌ల్!

Drukpadam

ఉప్పల్ టీఆర్ యస్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు … ఖండించిన ఎమ్మెల్యే…

Drukpadam

Leave a Comment