Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు లేదనడం దాన్ని అవమానపరచడమే !

రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు లేదనడం దాన్ని అవమానపరచడమే !
మూడు రాజధానులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
అమరావతే ఏపీ రాజధాని అని చెప్పిన హైకోర్టు
నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశం
హైకోర్టు నిర్ణయం శాసన వ్యవస్థ అధికారాలను ప్రశ్నించడమేనన్న ఏపీ ప్రభుత్వం

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మల్లి సుప్రీం తలుపు తట్టింది .మూడు రాజధానులు పట్టాలని జగన్ సర్కార్ ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై అక్కడ రైతులు హైకోర్టుకు వెళ్లగా దానిపై హైకోర్టు సుదీర్ఘ తీర్పు ఇచ్చింది. దీంతో మూడు రాజధానుల వ్యవహారం ఆగిపోయింది. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కు వెళ్లడంతో రాష్ట్రము చూపు అంట సుప్రీం వైపు మళ్లింది. .
అమరావతే ఏపీ రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని… ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపేయాలనుకోవడం శాసన వ్యవస్థ అధికారాలను ప్రశ్నించడమే అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.

సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని సదుపాయాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో తెలిపింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పడం శాసనసభను అగౌరవపరచడమేనని చెప్పింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related posts

బాక్సింగ్ లో భారత్​ కు కాంస్య పతకం సాధించిన లవ్లీనా..అభినందనల వర్షం!

Drukpadam

ఎట్టకేలకు తెరుచుకున్న ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు!

Drukpadam

ప్రజలు కరోనా మార్గదర్శకాలు పాటించడంలేదన్న ఎయిమ్స్ చీఫ్ గులేరియా

Drukpadam

Leave a Comment