Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆస్తులు ఆదానికి …అప్పులు ప్రజలకు…బీజేపీ విధానాలపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం …

ఆస్తులు ఆదానికి …అప్పులు ప్రజలకు…బీజేపీ విధానాలపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం …
ఇది మోడీ దేశానికి చేసిన మేలు : భట్టి వ్యంగ్యం
దేశాన్ని అప్పలు మయం చేసింది మోడీ కాదా? అని ప్రశ్న
రాష్ట్రంలో బండి సంజయ్ చేస్తున్నవి సంగ్రామ యాత్రలు కాదు …సంఘర్షణ యాత్రలు
ప్రజలను కులాలుగా ,మతాలుగా విభజించే యాత్రలు
ప్రపంచంలో రెండో స్థానం కుబేరుడుగా ఆదాని ఎదగడానికి ప్రధాని మోడీ చేసిన సహకారమే కారణం ..
దేశ ఆస్తులను వ్యవస్థలను సంస్థలను ఆదానికి దారాదత్తం చేసిన మోడీ

దేశంలో మోడీ పాలన వచ్చిన తరువాత ఆస్తులు ఆదానికి , అప్పులు ప్రజలపై రుద్దారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బీజేపీ విధానాలపై తీవ్రస్థాయిలు ధ్వజమెత్తారు . ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సన్నాహక సమావేశాల్లో భాగంగా భట్టి పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులతో కలిసి మునుగోడులో పర్యటించారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ,టీఆర్ యస్ విధానాలపై విరుచుకపడ్డారు .

రూ.50 వేల కోట్ల అధిపతి ఆదాని 8 సంవత్సరాల కాలంలో రూ.11 లక్షల కోట్లు దాటడానికి మోడీ ఈ దేశ ఆస్తులను ఆయనకు ధారాదత్తం చేయడం వల్లనే సాధ్యం అయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు . ప్రజలపై భారాలు …కార్పొరేట్ వ్యవస్థలకు లాభాలు మోడీ పాలనలోనే సాధ్యమైయ్యాయని విమర్శలు గుప్పించారు .

బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ చేసింది సంగ్రామ యాత్ర కాదు. విషయాత్ర,విభజన యాత్ర ,సంఘర్షణ యాత్ర ,ప్రజలను మతాలుగా ,కులాలుగా విడిపోయి కొట్టుకోండని చెప్పేందుకే సంగ్రామ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు . ప్రజల్లో విభజన తెచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టి కులాలు మతాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ బండి సంజయ్ చేసిన యాత్ర విషయాత్రగా,సంఘర్షణ యాత్రగా భట్టి అభివర్ణించారు .

దేశ ఆస్తులను అమ్ముతూ జాతిని విచ్ఛిన్నం చేస్తున్న బిజెపిని మునుగోడు గడ్డపైన అడుగుపెట్టనివ్వకపోవడమే మంచిదన్నారు .డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిన బిజెపిని ఓడిస్తేనే వాటి ధరలు తగ్గుతాయన్నారు

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల కుప్పగా చేసి తాకట్టు పెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పాలనలో ప్రజలకు 5 లక్షల కోట్ల అప్పే మిగిలిందని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ యస్ ప్రభుత్వంపైనా భట్టి ధ్వజమెత్తారు .ఎన్నికల వాగ్దానాలు హామీలను అమలు చేయని టిఆర్ఎస్ సర్కార్కు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పాల్సిందేనని పిలుపునిచ్చారు .

నిరుద్యోగ భృతి రైతు రుణమాఫీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మూడు ఎకరాల భూ పంపిణీ రైతులకు గిట్టుబాటు ధర, ధాన్యానికి మద్దతు ధర, ఉదయ సముద్రం, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేయని టిఆర్ఎస్ సర్కార్ కు ఓట్లు వేస్తారా? మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీలను దూరం పెట్టి కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపిస్తేనే తెలంగాణలో సంక్షేమ రాజ్యం వస్తుంది .ఉద్యోగాలు ఉపాధి కల్పన పెండింగ్ ప్రాజెక్టుల కొనసాగింపు రైతుల ఆత్మగౌరవం ప్రభుత్వ రంగ వ్యవస్థలు కాపాడటం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు . అందరికీ అందుబాటులో ఉండే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని అత్యధిక మెజార్టీతో మునుగోడు ప్రజలు గెలిపించాలి

మీడియా సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు చల్ల నర్సిరెడ్డి, ఎస్ సత్యనారాయణరావు, రవళిరెడ్డి తదితరులు ఉన్నారు.

Related posts

ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్

Drukpadam

కేజ్రీవాల్ పార్టీ నుండి కాంగ్రెస్‌కు ఊహించని ఆఫర్!

Drukpadam

బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం పొడిగింపు!

Drukpadam

Leave a Comment