Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీలో తిరుగుబాటు …80 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు :మాజీమంత్రి దేవినేని ఉమా…

వైసీపీలో తిరుగుబాటు …80 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు :మాజీమంత్రి దేవినేని ఉమా…
-సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని జగన్ కుప్పంలో ఏం చేస్తారు?
-గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతంగా జరిగింది
-విశాఖలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు

వైసీపీలో తిరుగుబాటు తప్పదని సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో సీఎం జగన్ ఉన్నారని అలాంటి వ్యక్తి కుప్పానికి ఎదో చేస్తానని చెప్పడం హాస్యాస్పందంగా ఉందని మాజీమంత్రి దేవినేని ఉమా… అన్నారు . అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పాలనపై విరక్తి చెందుతున్నారని ఎప్పుడైనా తిరుగుబాటు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు . తమకు తెలిసిన సమాచారం ప్రకారం 80 ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉన్నారని అన్నారు . అప్పుడు జగన్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి చంద్రబాబు మంత్రి వర్గంలో భారీ నీటిపారుదల శాఖ భాద్యతలు నిర్వహించిన దేవినేని ఉమా ఈ సంచలన విషయాలు వెల్లడించారు . అయితే వైసీపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే చర్చకు ఉమా మాటలు ఆస్కారం కల్పించాయి. జగన్ ప్రభుత్వం పై , ఒంటికాలిపై లేచే ఉమా మాటలకూ విలువలేదని సొల్లువాగుడు వాగుతున్నాడని వైసీపీ నేతలు ఉమపై విమర్శలు గుప్పిస్తున్నారు .

వైసీపీలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని… తిరుగుబాటు చేసేందుకు 80 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. సొంత ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని జగన్… కుప్పంలో ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతంగా జరిగిందని చెప్పారు. రైతుల పాదయాత్ర జరుగుతుంటే… వీధిలైట్లు తీయించే స్థాయికి బూతుల మంత్రి దిగజారాడని మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు.

విశాఖలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారని చెప్పారు. రిషికొండను బోడికొండగా మార్చేశారని చెప్పారు. నందివాడ మండలంలో అమరావతి రైతుల పాదయాత్ర ఈరోజు కొనసాగింది. ఈ యాత్రలో దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Related posts

ముగిసిన అమరావతి రైతుల మహా పాదయాత్ర!

Drukpadam

చీరాల వైసీపీ ఎమ్మెల్యే కరుణం వర్సెస్ ఆమంచి వర్గాల ఘర్షణ!

Drukpadam

తాను టీఆర్ యస్ లో చేరుతున్నట్లు కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారు :ఈటల

Drukpadam

Leave a Comment