Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడులో తెలంగాణ జనసమితి పోటీ ….?అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ …?

మునుగోడులో తెలంగాణ జనసమితి పోటీ ….?అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ …?
బరిలో బీసీ అభ్యర్థి ని పెట్టాలనే ఆలోచనతోనే ముందుకు
టీఆర్ యస్ , బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శ
ధరల పెరుగుదలకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు భాద్యత వహించాలి

ఇంకా మునుగోడు ఉపఎన్నికల తేదీలు ప్రకటించలేదు …అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి…ప్రధానంగా టీఆర్ యస్ , బీజేపీ లు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీసీలు అధికంగా ఉన్నప్పటికీ టీఆర్ యస్ , బీజేపీలు రెడ్డి సామజిక వర్గం నుంచే అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో డబ్బులు ఉన్న అభ్యర్థులను పెట్టడం పెద్ద పార్టీలకు ఆనవాయితీగా మారింది. కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థిగా రెడ్డి సామజిక వర్గానికి చెందిన పాల్వాయి స్రవంతి అనే మహిళను బరిలో నిలుపుతుంది. దీంతో అన్ని పార్టీలు ఒకే ఆలోచనతో ముందుకు పోతున్నాయి.

ప్రధాన పార్టీలు బీసీ,ఎస్సీలు , ఎస్టీలు మైనార్టీలను రంగంలో దించటం లేదు . అందువల్ల తెలంగాణ జనసమితి తన అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని రంగంలోకి దించబోతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగోపగాని శంకర రావు తెలిపారు . అయితే ఆయన అభ్యర్థి పేరు ఒకటవ తేదీన ప్రకటిస్తామని చెప్పినప్పటికీ తెలంగాణ జనసమితి తరుపున పల్లె వినయ్ కుమార్ గౌడ్ ని బరిలోకి నిలిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో సిపిఐ లో పనిచేసిన వినయ్ కుమార్ కోదండరాం కు దగ్గరైయ్యారు. ఆయనతో కలిసి నియోజకవర్గంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.అంతే కాకుండా 48 వేలకుపైగా గౌడ సామాజికవర్గ ఓట్లు ఉండటం ,వినయ్ రాజకీయ కుటుంబం కావడంతో తమకు అనుకూలంగా ఉంటుందని జనసమితి నేతలు భావిస్తున్నారు.అందువల్ల తమ వాయిస్ వినిపించేందుకు మునుగోడులో పోటీచేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు . టీఆర్ యస్ నుంచి మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ , కాంగ్రెస్ నుంచి డాక్టర్ చెరుకు సుధాకర్ టికెట్స్ ఆశించినప్పటికీ ఉన్నత సామాజికవర్గాలకు చెందినవారి వైపే మొగ్గు చూపడంపై చర్చ జరుగుతుంది. గెలుపు ఎవరిదీ అయినప్పటికీ నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా ఎవరి ఓట్లు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు తెలుసుకునేందుకు అక్కడ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు .

Related posts

ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు నడుం బిగించిన కేసీఆర్!

Drukpadam

అమర్ రాజా బ్యాటరీ సంస్థ విషయంలో ,సజ్జల ,బొత్స విరుద్ధమైన మాటలు!

Drukpadam

ఈవీఎం లను తరలించే బస్సు లను టీఆర్ యస్ హోటల్ నేత దగ్గర ఆపారు …బీజేపీ నేత డీకే అరుణ ఫిర్యాదు …

Drukpadam

Leave a Comment