Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణాలో మే 1 ఉదయం వరకు రాత్రిపూట కర్ఫ్యూ

తెలంగాణాలో మే 1 ఉదయం వరకు రాత్రిపూట కర్ఫ్యూ
– రాత్రి పూట 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు
-కేసులు పెరుగుతున్న దృష్ట్యా సర్కార్ నిర్ణయం
-అత్యవసర సేవలకు మినహాయింపు
-ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ ల నుంచి వచ్చే ప్రయాణికులు టిక్కెట్లు చూపించాలి
-నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే
-జిల్లా కలెక్టర్లకు , ఎస్పీ లకు ఆదేశాలు

కరోనా మహమ్మారి విజృభిస్తున్న వేళ హైకోర్టు మొట్టికాయలతో తెలంగాణ అప్రమత్తం అయింది . మే 1 వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసించి . రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ప్రకటించింది . దేశంలో గత రెండు మూడు వారాలుగా కరోనా మహమ్మారి విజృభిస్తుంది. తెలంగాణాలో కూడా దాని ప్రభావం ఉండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు అములు చేయాలనీ నిర్ణయించుకుంది. ఇటీవల కాలంలో తెలంగాణాలో కేసులు సంఖ్య బాగాపెరిగింది . రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇది తక్షమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాపారులు తమ షాప్ లను రాత్రి 8 గంటలవరకు మూసివేయాల్సి ఉంటుంది. అయితే అత్యవసర సేవల కేటగిరిలో మీడియా , ఈ కామర్స్ ,డెలివరీ , ఇంటర్నెట్ ,కేబుల్ ,పెట్రోల్ పుంపులు , గ్యాస్ స్టేషన్లు , విద్యుత్ , నీరు, కోల్డ్ స్టోరేజీలు , వెర్ హోసింగ్ , ప్రవేట్ సెక్యూరిటీ , ఉత్పత్తికు సంబందించిన అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నది . వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.సిబ్బందికి తగిన గుర్తింపు కార్డులు ఉండాలి . పేషంట్లు ,గర్భిణీ స్త్రీలు , ,విమాన ప్రయాణం చేసేవారు. రైల్వే , బస్టాండ్ లనుంచి వచ్చే వారు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాపితంగా వెంటనే కర్ఫ్యూ అమలు చేసేందుకు జిల్లాల కలెక్టర్లు , సూపరెండెంట్ ఆఫ్ పోలీసులు లకు అధికారాలు ఇచ్చారు. ప్రభుత్వ నిభందనలు ఉల్లఘించినవారిపై డిసాస్టర్ మేనేజ్ మెంట్ సెక్షన్ లు 51 నుంచి 60 , మరియు ఇండియన్ పీనల్ కోడ్ 188 ప్రకారం శిక్షార్హులు అవుతారని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నిభందనలు మే 1 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలంగాణ సర్కార్ తెలిపింది.
కేంద్రప్రభుత్వం మరో ఉత్తర్వులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 తగ్గకుండా కార్యాలయాలకు హాజరు కావాలని పేర్కొన్నది . డిప్యూటీ సెక్రటరీ స్థాయి ఉద్యోగులు మాత్రం ప్రతిరోజూ హాజరు కావాల్సిందే . .

Related posts

దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ … ప్రధాని మోడీ

Drukpadam

రికార్డు కోసం అధికారుల నిర్వాకం… మధ్యప్రదేశ్ జాబితాలో 13 ఏళ్ల బాలుడి పేరు!

Drukpadam

ఒమిక్రాన్ ఉప్పెనలా వ్యాపించనుంది: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్!

Drukpadam

Leave a Comment