వైసీపీని అలీ వీడుతున్నట్లు వార్తలు.. కొట్టిపారేసిన టాలీవుడ్ కమెడియన్!
- తనపై కుట్ర జరుగుతోందన్న అలీ
- వైసీపీలో చేరింది పదవుల కోసం కాదన్న నటుడు
- జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంతోనే వైసీపీలో చేరినట్టు వెల్లడి
- పదవుల కంటే జగన్ మనసులో స్థానమే తనకు ముఖ్యమన్న కమెడియన్
టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీ నేతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన వైసీపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో జగన్‌ను కలిసిన అలీకి రాజ్యసభ సభ్యత్వం ఖాయమంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలేవీ వాస్తవ రూపం దాల్చకపోగా… తాజాగా వైసీపీకి అలీ గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై అలీ తాజాగా స్పందించారు.
అలీ వైసిపిని వీడుతున్నారని వార్తలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి . ఇది నిజమేనా అయిన పార్టీని వీడుతున్నారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి . ఆయనకు పార్టీ నేత ఏపీ సీఎం జగన్ రాజ్యసభ సీటు ఇవ్వనున్నారని కూడా ప్రచారం జరిగింది. తరవాత మరో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి గుడ్ బై చెబుతున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో అలీ స్పందించారు . తాను మరోసారి జగన్ అధికారంలోకి వచ్చేందుకు ప్రచారం చేస్తానని తెలిపారు . దీంతో ఆయన వైసిపిని వీడబోతున్నారనే ప్రచారానికి తెరపడనుంది….
తాను వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అలీ తేల్చి చెప్పారు. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన అలీ… అయినా వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తాను వేరే పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వైసీపీలో తాను చేరింది పదవుల కోసం కాదని అలీ చెప్పారు. జగన్ ను సీఎం చేయాలనే లక్ష్యంతోనే తాను వైసీపీలో చేరానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానమే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.