ఉద్యమకారుల సంక్షేమ కోసం, బోర్డు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ …కరీంనగర్ వేదికగా ఫోరమ్ మీట్…
-తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు గుర్తింపు లేకపోవడం శోచనీయం
-తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం ఉద్యమిద్దాం ,
-తెలంగాణలోనూ సీమాంధ్ర పెత్తనమేంది..సిగ్గుచేటు ….
-తెలంగాణ ఉధ్యమకారుల ఫోరం 3వ ఆవిర్భావ దినోత్సవ సదస్సు పాంప్లెట్ ఆవిష్కరణ
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 3వ ఆవిర్భావ దినోత్సవ సదస్సు శుక్రవారం ప్రెస్ భవన్ కరీంనగర్లో ఉదయం 10 గంటల నుండి జరుగుతుందాని అన్నారు . దానికి సంబంధించిన పాంప్లేట్ ను డాక్టర్ కె.వి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు . అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమకారులంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం , తెలంగాణ ఉద్యకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా 3 సం॥రాల క్రితం మన ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ లక్ష్యం కోసం అనేక కార్యక్రమాలని చేస్తున్నాము . ప్రభుత్వానికి ఉద్యమకారులకు మధ్య వారధిగా పని చేస్తున్నాము . మానుకోట ప్రజాప్రతిఘటన , మిలియన్ మార్చ్ , సహాయ నిరాకరణ , సకలజనుల సమ్మె, సాగరహారం , సమర దీక్ష , సంసద్ యాత్ర , అసెంబ్లీ ముట్టడి , సకల జనబేరి లాంటి ఉద్యమకార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకొన్నాము .1200 మంది వరకు ఆత్మబలిదానాలు చేసుకొన్నారు . తెలంగాణ రాష్ట్ర సాధనే ధేయ్యంగా అనేక మంది ఉద్యమకారులు తమ భవిష్యత్ , కుటుంబాల గురించి ఆలోచించకుండా ఉద్యమం చేసారు . కాని నేడు గుర్తింపు లేకుండా , ఆత్మగౌరవం లేకుండా , జీవనోపాధి కరువై జీవిస్తున్నారు . కొంత మంది ఆరోగ్య సమస్కలతో కుడా బాధపడుతున్నారు . తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ ఉద్యమనాయకుడు , ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కె.సి.ఆర్. గారు ఉద్యమకారుల సంక్షేమం కోసం కూడ అలోచించి ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము . ఉద్యమ సమయంలో కె.సి.ఆర్. వెంట నడిచిన ఉద్యమ కారులకి ప్రాధాన్యత ఇవ్వాలని , అన్ని రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ప్రకటించాలని , ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు . తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫ్రో జయశంకర్ సారు బాటలో నడుస్తు తెలంగాణ పునర్మిణాం కోసం , ప్రజాస్వామిక , సామాజిక తెలంగాణ కోసం కృషిచేస్తుందని , ప్రజాస్వామిక విలువల కోసం ప్రజా సంఘంగా పని చేస్తుందని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. తెలంగాణ ఉద్యమకారులందరు ఈ ఫోరంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సం॥రాలు గడిచిన సీమాంధ్ర కార్పోరేట్ వర్గాల ఆధిపత్యం అన్ని రంగాలలో కొనసాగుతూనే ఉన్నది . విద్యా , వైద్య , సినిమా , మీడియా , కాంట్రాక్ట్ , ఉదోగ్య రంగాలలో సీమాంధ్ర పెత్తనమే కొనసాగుతుంది . మార్వాడీల ఆదిపత్యం అన్ని వ్యాపార రంగాలలో విపరీతంగా రోజురోజుకి ఎక్కువైపోతుంది . తెలంగాణ ప్రజల వ్యాపార ప్రయోజనాలని దెబ్బతీస్తున్నారు . తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలి . అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారుల డిక్లరేషన్ ని ప్రకటించాలి , ఉద్యమకారులకి పెన్షన్ , ఉచిత బస్సు ట్రైన్ పాసులను , ఆరోగ్య కార్డులను , 300 గజాల ఇంటి స్థలాన్ని వడ్డీ లేని రుణాలని , సంక్షేమ పథకాలలో 20% కోట కేటాయించాలి , తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి గౌరవించాలి అని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యతన్ని ఇవ్వాలి . ఈ కార్యక్రమంలో గుంతేటి వీరభద్రం , పద్మ చారి , రాయిస్ అన్వార్ , నెల వెళ్లి వెంకటేశ్వరరావు , వల్లభనేని వెంకట రామకృష్ణ , భూక్యా శ్రీనివాస్ నాయక్ , లింగాల ప్రసాద్ రావు , సైదులు , కృష్ణ చైతన్య , ప్రణయ్ , జగదీష్ , దాసరి శీను , భారత్ , నరేష్ , సుందర్రావు , గోపి నాగేశ్వరావు , లింగనబోయిన సతీష్ , సయ్యద్ భూరాన్ , ఆశిర్ , అసిఫ్ , మంచికంటి నరేష్ , కేవి తదితరులు పాల్గొన్నారు .