Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టపరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలి:పి వై ఎల్ -పి ఓ డబ్ల్యు

ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టపరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలి.

పి వై ఎల్ -పి ఓ డబ్ల్యు ఆధ్వర్యంలో ప్రదర్శన-ధర్నా.

జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి.
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్స్ కు నూతన భవనాలు నిర్వహించాలి.

డెంగు, మలేరియా, టైఫాయిడ్, విషజరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రామనర్సయ్య విజ్ఞాన కేంద్రం నుండి మున్సిపల్ కార్యాలయం, గట్టయ్య సెంటర్, జెండాల సెంటర్, మీదుగా డి ఎం హెచ్ ఓ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించడం జరిగింది….

ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి రాకేష్, ప్రగతిశీల మహిళా సంఘం(POW) జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యమంటూ వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రతి ఆసుపత్రి కార్పొరేట్ వైద్యశాల అన్న వైద్య శాఖ మంత్రి మాటలు పేపర్ ప్రకటనకే పరిమితమయ్యాయి అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు పరిశీలిస్తే అర్థమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు….
ఖమ్మం జిల్లా అధికంగా ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నందున గిరిజనులు పేద ప్రజలు ఎక్కువ జనాభా ఉన్న ఈ జిల్లా లో సుమారు 24 PHC సెంటర్స్, 10 CHC సెంటర్లు ఉన్నాయి, వీటి పరిధిలో సుమారు 20 నుంచి 30 సబ్ సెంటర్స్ ఉన్నాయి,కానీ సబ్ సెంటర్ కి ఎక్కడ మెజార్టీ గా సొంత బిల్డింగ్స్ లేవు ANM, ఆశ వర్కర్స్ పోస్టులు 50 నుంచి 60 పోస్టులు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండవలసిన ఏఎన్ఎమ్స్, ఆశా వర్కర్స్ లేకపోవడం వల్ల పేద ప్రజలకు వైద్యం దూరమవుతుంది. ముఖ్యంగా జిల్లాలో PHC,CHC లో రెగ్యులర్ పోస్ట్లు లేవు మెజార్టీ కాంట్రాక్ట్, డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నెలకొండపల్లి, వైరా, కల్లూరు CHC సెంటర్లో హాస్పిటల్ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, మరియు రోగులు, ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది శిధిలావస్థలో ఉన్న హాస్పటల్స్ కు నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. PHC నుంచి CHC సెంట్రల్ గా ఏర్పాటు చేసి సంవత్సరకాలం అవుతున్న గాని సరిపడా వైద్య సిబ్బంది లేరు,వర్షాకాలంలో ప్రతి ఏడాది సీజనల్ వ్యాధులు సోకి అవస్థలు పడాల్సి వస్తుంది,డెంగ్యూ, మలేరియా, టైఫా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకొని కారణంగా
వర్షాకాలంలో ప్రతి ఏడాది సీజనల్ వ్యాధుల సోకి, ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోందని , సీజన్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. …
పారిశుద్ధ్యం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు చేరుకునే పరిస్థితి లేదని అన్నారు, ఆరోగ్య కేంద్రాల చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్లే దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ,మలేరియా వైరల్ జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు,
ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు, రోజుకొక కొత్త జబ్బు పుట్టుకొస్తుంటే వాటిని అరికట్టేందుకు పారిశుద్ధ సిబ్బంది సంఖ్య పెంచి పట్నాలలో, గ్రామాలల్లో దోమల విరుగుడికి పాగింగ్ చర్యలు చేపట్టాలని, వీధులన్నీ శుభ్రపరచాలని, గ్రామాల్లో, పట్నాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలని వారు అన్నారు….
జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న డాక్టర్స్ ,ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్ ,ల్యాబ్ టెక్నీషియన్, స్లీపర్స్, వాచ్మెన్, సూపర్వైజర్స్ పోస్టులను తక్షణమే భర్తీ చేసి గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించి సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలని డిమాండ్ చేశారు..

 

జిల్లావ్యాప్తంగా పి వై ఎల్ పి ఓ డబ్ల్యు (PYL – POW) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 18 రోజులపాటు సర్వే నిర్వహించిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని DMHO ఆఫీస్ సూపర్డెంట్ & AO గార్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో POW -PYL జిల్లా అధ్యక్షులు గోకినపల్లి లలిత, గంట శ్రీను, నాయకులు ఝాన్సీ ,మంగతాయి, భరత్, మోహన్ రెడ్డి, ప్రేమ్ సింగ్, బాలు, ధరణి, చందు, వెంకటేశ్, సందీప్, అనసూర్య ,లలిత ,సరోజినీ, పూలమ్మ, కల్పన, స్వాతి, షాను తదితరులు పాల్గొన్నారు
తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీఆర్ యస్ లో అలజడికి కారణమైన అధికారులతో తుమ్మల సమీక్ష !

Drukpadam

వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు: మాజీ మంత్రి బాలినేని!

Drukpadam

టీడీపీ ఎన్డీఏలో చేరికపై స్పందించిన చంద్రబాబు ,ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ …

Drukpadam

Leave a Comment