ఖమ్మంలో పిడుగుపడి రెండుకార్లు నుజ్జు నుజ్జు ..
గోడకులడంతో కార్లమీద పడిన గోడ
కార్లను గోడపక్కన్ పెట్టడంతో ఘటన
ఖమ్మం లో గత రాత్రి భారీ వర్షం కురిసింది….నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజాజీవనం స్తంభించిపోయింది. దీనికి తోడు ఉరుములు మెరుపులు రావడంతో ప్రజలు బెంబేలు ఎత్తారు . ఇళ్లలోనుంచి బయటకు వచ్చేందుకు వణికి పోయారు . చిన్నపిల్లలు ఉరుములు ,మెరుపులకు భయకంపితులయ్యారు. బతుకమ్మ వేడుకల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడ్డారు . వాతావరణంలో పెద్దగా మార్పులు లేనప్పటికీ ఆకస్మికంగా వచ్చిన వర్షానికి ప్రజలు అయోమయానికి గురైయ్యారు . వీధులన్నీ నదుల్లా మారాయి. కాలువల వరద రోడ్లపైకి వచ్చింది.మయూరి సెంటర్ పాట బస్సు స్టాండ్ , కాలవ ఒడ్డు,బురదరాఘవాపురం , శ్రీనివాస్ నగర్ ,ప్రకాష్ నగర్ లాంటి ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేకపోయారు .
రాత్రి ఖమ్మం లో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ఖమ్మం సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రహారి గోడ కూలి రెండు కార్లు దేనికి పనికి రాకుండా మరొక కారు నలిగిపోయింది ప్రకాష్ నగర్ పత్తి మార్కెట్ దారిలో ఈసంఘటన చోటు చేసుకొన్నది.పిడుగు పడ్డ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ , వ్యాపారులు స్థానికులు పెద్ద ఎత్తున ఈదృశ్యాలు చూశారు.