Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత:మంత్రి పువ్వాడ అజయ్ కుమార్!

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత:మంత్రి పువ్వాడ అజయ్ కుమార్!
-ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం బడ్జెట్ లో అధిక నిధులు..
-వైద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం పటిష్ట చర్యలు.
-కనీస వ్యాయామంతో ఎన్నో మంచి ఫలితాలు..
-జిల్లాకు క్యాన్సర్ కేర్ ఆసుపత్రికి మంజూరు..రానున్న రోజుల్లో కేన్సర్ సంబంధిత అన్ని చికిత్సలు, వైద్యం ఇక్కడే అందిస్తాం.
-ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అజయ్

ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుందని, ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్డియాక్ హెల్త్ చెకప్ క్యాంపు ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న జీవన విధానం వల్ల గుండె సమస్యలు అధికంగా పెరుగుతున్నాయని అన్నారు. ఒకప్పుడు అరవై పైబడిన వారిలో మాత్రమే కనిపించే హృద్రోగాలు ప్రస్తుతం 40 ఏండ్లలోపు వారికి కూడా వస్తుందని, రక్తనాళాల్లో అవరోధాలే గుండెపోట్లకు ప్రధాన కారణమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది కేవలం గుండె, రక్తనాళాల సమస్యలతోనే మృత్యువాత పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయని, దీనికి ప్రధాన కారణం మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లే అని గుండె సంభందిత వైద్యులు చెబుతున్నారని వివరించారు. సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లతో హృద్రోగ మరణాలను 80 శాతం వరకు తగ్గించగలమన్నారు. చిన్నపాటి వ్యాయాయంతో, చక్కటి ఆహార అలవాట్లతో ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి నాళ్ళలో ప్రస్తుత ఆసుపత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి 200 పడకల ఆసుపత్రిగా పరమ చెత్తగా ఉండేదని, నాడు ఆసుపత్రి అభివృద్ది కోసం, బయో వెస్ట్ తదితర సమస్యలపై ఇక్కడే ధర్నా చేయడం జరిగిందన్నారు. కాని నేడు ఇదే ఆసుపత్రి 500 పడకల ఆసుపత్రితో పాటు మాతా శిశు కేంద్రం ను ఏర్పాటు చేసుకుని అద్భుతంగా అన్ని వసతులు, అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దామన్నారు. ఖమ్మం జిల్లాకు క్యాన్సర్ కేర్ ఆసుపత్రి మంజూరు అయిందని రానున్న రోజుల్లో కేన్సర్ సంబంధిత అన్ని చికిత్సలు, వైద్యం ఇక్కడే అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి చేసిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఖమ్మం జిల్లాకు మెడికల్ ఆసుపత్రి మంజూరు చేశారని, వచ్చే సంవత్సరం నుండి ఇక్కడ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని, కేసీఅర్ ముందు చూపుతో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ను మంజూరు చేశారని అన్నారు. నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అన్న పాటను పాడిన నానుడి నుండి.. నేడు ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఒకప్పుడు పెద్ద ఆపరేషన్ కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సివచ్చేదని కానీ నేడు ఖమ్మం లోనే అన్ని సర్జరీలతో సహా అన్ని వైద్య చికిత్సలు పూర్తి ఉచితంగా చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నదని, ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాలలో తెలంగాణ రోజు రోజుకు గుణాత్మక పురోగతిని సాధిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర నలుమూలలా వైద్య రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తుండడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి దార్శనికతకు అద్దం పడుతున్నాయన్నారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం వైద్య రంగాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచిందన్నారు. ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని మరింతగా పటిష్టపరిచేందుకు మానవ వనరుల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రత్యేక శ్రద్ద చూపారని, అందుకు అనుగుణంగా వైద్యశాఖలో 21,073 పోస్టులు కొత్తగా మంజూరు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటు నిర్మాణం, ఎంసిహెచ్ కేంద్రాలు, యూజీ, పీజీ, సూపర్ స్పెషలిటీ వైద్య సీట్ల పెంపు, నర్సింగ్ కాలేజీ సీట్ల పెంపుతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతపరుస్తున్నామన్న
ారు. ప్రజల వద్దకే వైద్యం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు విజయవంతంగా ప్రజాదరణ పొందుతున్నాయని, అదే స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటయిన పల్లె దవాఖానల్లో సేవలందుతున్నాయన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాదారణ ప్రసవాలతో పాటు కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలు ప్రజారోగ్య రంగంలో గుణాత్మక మార్పుకు దోహదం చేస్తున్నాయన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుతో ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తూ ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తతను కనబరుస్తున్నదన్నారు. మాత శిశు సంరక్షణ కేంద్రాలు, అమ్మఒడి వాహనాలు, ఆలన వాహనాలు, పరమ పద వాహనాలు, మార్చురీల ఆధునీకరణ, కాత్ ల్యాబ్ కేంద్రాలు, అవయవ మార్పిడి కేంద్రాలు, స్టెమ్ సెల్ థెరపీ కేంద్రాలు, జెనోమిక్ సీక్వెన్సింగ్ లాబొరేటరీలు వంటి అనేక సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నరు. ప్రజారోగ్య పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తుశుద్ధికి నిదర్శనమని, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించి ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు.పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం, ఎన్ సిడి స్క్రీనింగ్ ప్రోగ్రాం, మిడ్ వైఫరీ ప్రోగ్రాం, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ, పారిశుధ్య నిర్వహణ పాలసీ, ఆసుపత్రులలో రోగులకు డైట్ చార్జెస్ పెంపు, ఆసుపత్రులలో సహాయకులకు సబ్సిడీ భోజనం వంటి కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆరోగ్యశ్రీ సేవల పరిధిని విస్తృతపరిచామన్నారు. ప్రజల ఆరోగ్య సేవలను మూడంచెల వ్యవస్థ నుండి ఐదంచెల వ్యవస్థకు విస్తరించామని, ఆరోగ్య సేవల వికేంద్రీకరణ చేపట్టి జిల్లా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసిందన్నారు. ప్రాథమిక (పిహెచ్సీ, సీహెచ్సీ), ద్వితీయ (ఎహెచ్, డిహెచ్), తృతీయ – బోధనా ఆసుపత్రి, కొత్తగా ప్రివెంటివ్, సూపర్ స్పెషలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చమాన్నారు. ప్రివెంటివ్ వైద్యం కోసం పల్లె దవాఖాన, బస్తి దవాఖాన, సూపర్ స్పెషలిటీ లో టిమ్స్ ఆసుపత్రులు, మౌలిక వసతుల కల్పన చేసిందన్నారు.
కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. వైద్య పరిజ్ఞానం ఉన్న మంత్రి కృషితో అభివృద్ధిలో ముందున్నామన్నారు. ఎటువంటి మార్గం, ఆధారం లేని పేదవారే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని, వారికి నమ్మకం కల్పించాలని అన్నారు. క్యాథ్ ల్యాబ్ లో ఒక డాక్టర్ ఉన్నట్లు, మరో డాక్టర్ నియమించాలని, శాశ్వత సిబ్బందిని నియమించాలని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చాకా గ్రామీణ ప్రాంత వైద్యానికి ప్రాధాన్యత నిచ్చిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి వైద్య కళాశాల ఏర్పాటుతో వైద్య సేవలు మరింత చేరువవుతాయన్నారు. తెలంగాణ లో తప్ప ఏ రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల లేదన్నారు. వైద్య కళాశాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు మొదటిసారి ఖమ్మం జిల్లాలోని జరిగిందన్నారు. వ్యాధి రాకముందే నియంత్రణ చర్యలు ఎంతో మేలని, జబ్బు ముదిరాక ఆసుపత్రికి వెళ్ళేకంటే, ముందుగా స్క్రీనింగ్ చేసుకొని జాగ్రత్త పడటం ఉత్తమమని అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లా ఆసుపత్రికి క్యాథ్ ల్యాబ్ మొట్టమొదటగా ఖమ్మం జిల్లాలోని జరిగిందన్నారు. క్యాథ్ ల్యాబ్ లో సాంకేతిక సిబ్బంది, నర్సులను అనుభవం ఉన్నవారిని నియమించామన్నారు. ఇప్పటి వరకు 207 ఏంజియోగ్రామ్ లు, 59 స్టెంట్లు, 4 ఏంజియో ప్లాస్టి లు చేపట్టినట్లు తెలిపారు. 6 నెలల్లో 60 కేసులు వచ్చాయన్నారు. ప్రభుత్వ సదుపాయాల్ని ఇంకా ఎక్కువ మంది వినియోగించుకోవాలన్నారు. ఇంకా ఎక్కువ మందిని కవర్ చేయాలన్నారు. సిహెచ్సి, పిహెచ్సి లు క్రియాశీలకంగా ఉంది, రోగులను రెఫర్ చేసేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డా. మాలతీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, విభాగాల హెచ్ఓడీలు, వైద్యులు సిబ్బంది ఉన్నారు.

Related posts

జయలలిత మరణంపై అనుమానాలు!

Drukpadam

షారుఖ్ ఖాన్ కొడుకు అయినందునే ఆర్యన్ అరెస్ట్ : శత్రుఘ్నసిన్హా!

Drukpadam

బిపిన్ రావత్ మరణం తీవ్ర వేదన కలిగిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ

Drukpadam

Leave a Comment