విజయవాడ నుంచి వైసీపీ ఎంపీగా నాగార్జున పోటీ చేస్తారా ?
-జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేసిన అక్కినేని నాగార్జున
-రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని స్పష్టికరణ
-ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాగే ప్రచారం చేస్తున్నారంటూ అసహనం
-తన రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరో
ప్రముఖ సీని నటుడు …అగ్రహీరోలతో ఒకరు …మన్మదుడిగా పేరున్న అక్కినేని నాగార్జున విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని ప్రచారం జోరుగా జరుగుతుంది….నిజంగా నాగార్జున పోటీచేస్తారా ? అసలు ఆయనకు రాజకీయాలపై ఆశక్తి ఉందా? ఉంటె వైసీపీ నే ఎందుకు ఎంచుకుంటున్నారు ….అనే విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.మొదటినుంచి కాంగ్రెస్ కు అనుకూలమైన కుటుంబంగా అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం ఉంది. నాగార్జునకు సైతం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతుంది. దీంతో రంగంలోకి దిగిన నాగార్జున తన రాజకీయ ప్రవేశాన్ని కొట్టి పారేశారు .
రాజకీయ రంగ ప్రవేశంపై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే తనకు లేదన్న నాగార్జున… విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ఇలాగే ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున నాగార్జున విజయవాడ లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే 2024లో ఎలాగైనా విజయవాడ ఎంపీ సీటును గెలుచుకోవాలన్న దిశగా సాగుతున్న జగన్… విజయవాడ నుంచి పోటీ చేయాలని నాగార్జునకు ఆఫర్ ఇచ్చారని కూడా వార్తలు వినిపించాయి.