Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఇండోనేషియాలో విషాదం: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 182 మంది మృతి!

ఇండోనేషియాలో విషాదం: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 182 మంది మృతి!
-తూర్పు జావా ప్రావిన్సులోని మలాంగ్‌లో ఘటన
-మైదానంలోకి దూసుకెళ్లిన ఓడిన జట్టు అభిమానులు
-అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
-తొక్కిసలాటలో మరో 150 మందికి గాయాలు

యూరప్ ,ఆసియా ఆఫ్రికా , సెంట్ర అమెరికాలోని కొన్ని దేశాల్లో ఫుట్ బాల్ అంటే పిచ్చి అంటారో ప్రేమ అంటారో తెలియదు కానీ …ఒక్కక్కసారి ప్రాణాలమీదకు వస్తుంది.అలంటి సంఘటనే ఇండోనేషియాలోని ఒక ఫుట్ బాల్ స్టేడియం లో చోటు చేసుకోవడంతో 182 మందివరకు చనిపోయారని అక్కడ ప్రభుత్వం తెలిపింది.వందలాది మంది గాయపడ్డారు . ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా ఓడిపోయినా టీం అభిమానులు గెలిచినా టీం సభ్యులపై దురుసుగా ప్రవర్తిన్చాడమే ఇందుకు కారణమని తెలుస్తుంది…పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణను నివారించకపోతే మరిన్ని మరణాలు సంభవించేవని తెలుస్తుంది.

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 182 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరేమా ఫుట్‌బాల్ క్లబ్-పెర్సెబయ సురబయ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఇండోనేషియా పోలీసులు తెలిపారు. ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది.

మలాంగ్‌లో జరిగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులు మైదానంలోకి చొచ్చుకెళ్తున్న వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. కాగా, ఈ మ్యాచ్‌లో పెర్సెబయ 3-2తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో ఇండోనేషియాలోని ప్రముఖ లీగ్ అయిన బీఆర్ఐ లీగ్ 1.. వారం రోజులపాటు మ్యాచ్‌లను నిషేధించింది. మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా (పీఎస్ఎస్ఐ) విచారణకు ఆదేశించింది. కాగా, ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి.

Related posts

గొలుసు దొంగతనాల వ్యక్తి హోటల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాక!

Drukpadam

ప్రజల నుంచి రూ.300 కోట్లు కాజేసి పారిపోయి.. సాధువుగా జీవనం!

Ram Narayana

సైబర్ మోసాల్లో వేరే లెవల్.. కోర్ట్ సెట్టింగ్ వేసి సరికొత్త మోసం

Ram Narayana

Leave a Comment