Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఖరారు …నవంబర్ 3 పోలింగ్ …

మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్!

  • ఈ నెల 7న విడుదల కానున్న నోటిఫికేషన్
  • నవంబర్ 3న పోలింగ్
  • నవంబర్ 6న కౌంటింగ్

తెలంగాణ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. కాసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల ఉప ఎన్నికలతో పాటు మునుగోడుకు కూడా షెడ్యూల్ ని సీఈసీ వెలువరించింది.

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ఇదే:

  • నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ : ఈ నెల 7
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : ఈ నెల 14
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : ఈ నెల 17
  • పోలింగ్ జరిగే తేదీ : నవంబర్ 3
  • కౌంటింగ్ జరిగే తేదీ : నవంబర్ 6

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి… కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో బీజేపీ తరపున కోమటిరెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ప్రకటించలేదు. ఈ సాయంత్రంలోగా తమ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో… టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. మరోవైపు… ఇటీవలి కాలంలో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ… ఈ ఉప ఎన్నికలో సైతం సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఎలాగైనా గెలిచి పునర్వైభవాన్ని తెచ్చుకోవాలనే కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో… మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడిని అమాంతం పెంచబోతుంది.

Related posts

వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం..రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం!

Drukpadam

రాయల చెరువుకు మరమ్మతులు పూర్తి…ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి!

Drukpadam

సీటు బెల్ట్ విషయంలో ఇక కఠిన నిబంధనలు!

Drukpadam

Leave a Comment