జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు..
హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి.
ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సమావేశంలో కే రామనారాయణ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించడంతోపాటు ఉన్న హక్కులను సైతం హరిస్తున్నాయని టి యు డబ్ల్యూ జే ఐ జె యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రామనారాయణ ఆరోపించారు. సోమవారం జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా ఐజెయు ఖమ్మం జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆవుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కూడా నేటి బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో జర్నలిస్టులు ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన ఇండ్ల స్థలాల కేటాయింపు వాగ్దానం ఈరోజు వరకు నెరవేరలేదని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయినందున ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ కార్డులు ఎంత మాత్రం ఉపయోగపడటం లేదని రామ్ నారాయణ అన్నారు కరీంనగర్కు చెందిన అశోక్ అనే జర్నలిస్టు హెల్త్ కార్డు తీసుకుని పలు ఆసుపత్రులు చుట్టూ తిరిగి వైద్యం అందక మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్రిడేషన్ల కేటాయింపు విషయంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు ఖమ్మం జిల్లాలో ఆ కమిటీ రెండవ సమావేశం జరిగి నెల రోజులు కావస్తున్న ఇంకా ఆ కార్డులు జర్నలిస్టులకు అందలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బందు గిరిజన బంధు పథకాలను దళిత గిరిజన జర్నలిస్టులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు .కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే గతంలో ప్రెస్ కౌన్సిల్లో జర్నలిస్టులు సభ్యులుగా ఉండి జర్నలిస్టు సమాజానికి కనీస స్థాయిలోనైనా మేలు జరిగే విధంగా ఉపయోగపడేవారని ఆయన అన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం ఆ కౌన్సిల్లో జర్నలిస్టులకు సభ్యత్వం లేకుండా చేసి ప్రస్తుతం తమ ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. ఈ విధానం నచ్చక ఇటీవల టిఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఆ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించాలని ఐజ యు ఆధ్వర్యంలో పోరాటాలు సాగుతున్న విషయాన్ని చెబుతూ రాష్ట్రస్థాయిలో కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులకు కమిటీలు వేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 402 ఛానళ్లు పనిచేస్తున్నాయని వాటిలో రెండు లక్షలకు పైగా వివిధ స్థాయిల్లో జర్నలిస్టులు పనిచేస్తున్న విషయాన్ని ఆయన చెప్పారు. సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీంద్ర శేషు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వృత్తిపరమైన ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు. దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
…. జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి…..
మీడియా రంగంలో పెను మార్పులు సంభవిస్తున్న సందర్భంలో జర్నలిస్టులు వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రామ్ నారాయణ జర్నలిస్టులకు సూచించారు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని ఆయన సూచన చేశారు. సమావేశం నిర్వహించిన ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గాన్ని రాం నారాయణ అభినందించారు.
సమావేశంలో నాయకులు నర్వనేని వెంకటరావు మాట్లాడుతూ ప్రింట్ మీడియాలో ఐదేళ్లపాటు పనిచేసి ఎలక్ట్రానిక్ మీడియాలో చేసే వారిని మాత్రమే ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తిస్తుందని అన్నారు .నాయకులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు ,ఏనుగు వెంకటేశ్వరరావు ,మైస పాపారావు నాయకులు కనకం సైదులు ,నలజాల వెంకటరావు తదితరులు ప్రసంగించారు .ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది .అనంతరం కార్యవర్గంలో కొత్తగా పలువురుని నియమించారు
.సమావేశంలో
జర్నలిస్ట్ వ్నత్తిలో సుదీర్ఘ కాలం పాటు పని చేస్తున్న సీనియర్ నాయకులు కె. రాం నారాయణ, రవీంద్ర శేషు, శివకు
టియుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీ ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారు పత్రిక రంగంలో చేసిన సేవలను పలువురు నేతలు
కొనియాడారు.
ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో
రాష్ర్ట నాయకులు మాటేటి వేణుగోపాల్, నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాసరావు, వేగినాటి మాధవరావు,
ఎలక్ర్టానిక్ మీడియా జిల్లా నాయకులు భూపాల్, రమేష్, వాసు, నారాయణ, రామక్నష్ణ, మహేందర్, నవీన్, రాజేంద్ర ప్రసాద్, అయ్యప్ప, గోవింద్
నాయకులు వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షు డు మొహిద్దిన్ ,నామా పురుషోత్తం, శ్రీనివాసరావు , సిహెచ్ విజయ్, జకీర్, రాంబాబు, కిరణ్, శ్రీనివాసరావు, శ్రీధర్
తదితరలు పాల్గోన్నారు.