Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

టీకాలు.. తీసుకున్నవారిలో కేవలం 0.04శాతం మందికే మళ్ళీ కరోనా…

టీకాలు.. తీసుకున్నవారిలో కేవలం 0.04శాతం మందికే మళ్ళీ కరోనా
-కొవాగ్జిన్‌ తీసుకున్న వారిలో కేవలం 0.04శాతం మందికే కరోనా
-కొవిషీల్డ్‌ తీసుకున్న వారిలో 0.02-0.03 శాతం మందికి కొవిడ్‌
-పూర్తిగా నివారించలేకపోయినా.. మరణం నుంచి తప్పిస్తున్న టీకా
కరోనాను నిరోధించే టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కొంతమంది మహమ్మారి బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర ప్రభుత్వం కీలక గణాంకాలు వెలువరించింది. టీకా తీసుకున్న తర్వాత చాలా తక్కువ శాతం మందిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని వెల్లడించింది.

‘‘టీకా తీసుకున్న 10 వేల మందిలో ఇద్దరి నుంచి నలుగురు మాత్రమే కరోనా బారిన పడుతున్నారు. ఈ సంఖ్య చాలా చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ తెలిపారు.

93,56,436 మంది భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా తొలి డోసు తీసుకోగా.. కేవలం 4,208 మంది మాత్రమే కరోనా బారిన పడ్డారని గణాంకాలు తెలిపాయి. ఇక 17,37,178 మంది రెండు డోసులు తీసుకోగా.. 695 మందిలో మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు వెల్లడించాయి. అంటే టీకా తీసుకున్న తర్వాత కేవలం 0.04 శాతం మందికి మాత్రమే కరోనా సోకుతున్నట్లు తెలుస్తోంది.

ఇక సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాకు సంబంధించిన గణాంకాలు ఇంకా ఆశాజనకంగా ఉన్నాయి. 10,03,02,745 మందికి కొవిషీల్డ్‌ తొలిడోసు ఇవ్వగా.. 0.02 శాతం అంటే 17,145 మంది మాత్రమే కరోనా బారిన పడ్డారు. ఇక 1,57,32,754 మంది రెండో డోసు తీసుకోగా.. 0.03 శాతం అంటే 5,014 మందిలో కరోనా నిర్ధారణ అయ్యింది.

ఈ గణాంకాలు చూస్తే వ్యాక్సిన్లు సురక్షితమన్న విషయం స్పష్టమవుతోందని ప్రభుత్వం తెలిపింది. పైగా పైన తెలిపిన గణాంకాలు కొవిడ్‌ రోగులతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వైద్యారోగ్య సిబ్బందిని కూడా కలుపుకొని లెక్కించినవని పేర్కొంది. వారిని మినహాయిస్తే టీకా తీసుకున్న వారిలో కొవిడ్‌ బారినపడుతున్న వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే ప్రతిఒక్కరూ కరోనాను సమర్థమంతంగా ఎదుర్కోవాలంటే.. టీకా తీసుకోవాలని సూచించింది.

Related posts

అమెరికాపై ఒమిక్రాన్ పంజా.. వారం రోజుల్లో 3 శాతం నుంచి 73 శాతానికి పెరిగిన కేసులు!

Drukpadam

ఒమిక్రాన్ లక్షణాలు,తీవ్రత గురించి దానిని గుర్తించిన డాక్టర్ ఏమన్నారంటే…

Drukpadam

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసిన టీఎస్‌ఆర్టీసీ!

Drukpadam

Leave a Comment