Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

షో రూమ్ నుంచి ఇంటికి వచ్చిన కొత్త కారు …అదుపుతప్పి బైకులు ధ్యంసం..

షోరూము నుంచి కొత్త కారుతో ఇంటికొస్తే ఇలా జరిగిందేంటబ్బా!

  • గేటులోకి వస్తూనే అదుపు తప్పిన కారు
  • కారును నియంత్రించలేకపోయిన డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి 
  • బైకులు ధ్వంసం

షోరూము నుంచి కొత్త కారుతో ఇంటికొచ్చిన వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. గేటు నుంచి లోపలికి వచ్చిన కారును నియంత్రించడంలో విఫలమైన డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి అక్కడ పార్క్ చేసిన బైకులను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. వినోద్ కుమార్ అనే వైమానిక దళ మాజీ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేస్తూ.. ‘వాట్ ఏ గ్రాండ్ అరైవల్ హోమ్’ అని క్యాప్షన్ తగిలించారు.

ముంబైలో గురువారం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయింది. గేటు నుంచి ఇంటి ప్రాంగణంలోకి వస్తూనే అక్కడ పార్క్ చేసిన బైక్‌లను ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లింది. ఈ క్రమంలో బోల్తా పడబోయి కుదురుకుంది. గేటు తీసిన వ్యక్తితోపాటు సెక్యూరిటీ గార్డు  పరుగుపరుగున రావడం కనిపించింది. ఈ వీడియోను చూసిన వారిలో కొందరు రిబ్బన్ కటింగ్ కూడా చేయకముందే ప్రమాదం జరగడం విషాదమని అంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి ఘన స్వాగతాన్ని తామెప్పుడూ చూడలేదని కామెంట్ చేస్తున్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి బ్రేక్‌కు బదులుగా యాక్సెలరేటర్ నొక్కి ఉంటాడని ఇంకొందరు చెబుతున్నారు.

Related posts

చార్మినార్ వద్ద బాంబు బెదిరింపు కలకలం!

Drukpadam

భర్తను చంపించి పోలీసులకు ఫిర్యాదు చేసిన గడసరి భార్య …

Ram Narayana

రామ‌కృష్ణ‌ను బెదిరించిన‌ట్లు వనమా రాఘవ ఒప్పుకున్నాడు.. ఏఎస్పీ

Drukpadam

Leave a Comment