Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎజెండా లేకుండానే పార్టీ ప్రకటన … బీఆర్ యస్ మనుగడపై సందేహాలు..?

ఎజెండా లేకుండానే పార్టీ ప్రకటనబీఆర్ యస్ మనుగడపై సందేహాలు..?
కేసీఆర్ ప్రకటనపై కార్యకర్తల్లో అయోమయం
బీఆర్ యస్ పార్టీ పై కార్యకర్తల్లోనూ తీవ్ర అసంతృప్తి
జాతీయ పార్టీకి దిశానిర్దేశం లేకపోవడంపై విమర్శలు
కేసీఆర్ తన అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దుతున్నారనే అభిప్రాయం
టీఆర్ యస్ కే కమిటీలు లేవుఇక బీఆర్ యస్ కా ?అంటున్న పార్టీ శ్రేణులు
మునుగోడు ప్రచారంలో టీఆర్ యస్ రద్దుపై ప్రజలనుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు కరువు ..

కేసీఆర్ తెలంగాణ ఉద్యమనేత …తెలంగాణ సాధించిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు … ఎవరు ఎన్ని అన్నా ఆయన సారథ్యంలోనే తెలంగాణ వచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది …. అందులో వాస్తవం లేకపోలేదు …తెలంగాణ అంటే కేసీఆర్ …కేసీఆర్ అంటే తెలంగాణ …కానీ అది నిన్నటి మాట …నేడు అదీలేదు …తెలంగాణ ఉద్యమం ముందుండి నడిపించిన కేసీఆర్ తాను పెట్టిన టీఆర్ యస్ ను తానే నలిమేశారనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో తెలివైన కేసీఆర్ ఎందుకు ఇలాంటి తప్పటడుగులు వేశారని కొందరు అనుకుంటున్నారు . మరికొందరు చాల తెలివైనపని చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు . కేసీఆర్ మీద అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా , ఆయనంటే గిట్టని వాళ్ళు బీఆర్ యస్ ప్రకటనపై విమర్శలు గుప్పిస్తూ , తమకు అనుకూలంగా మలుచు కునే ప్రయత్నం చేస్తున్నారు .రాజకీయపండితులు కేసీఆర్ నిర్ణయం తొందరపాటు చర్యగా పేర్కొంటున్నారు . ఇది నిలబడుతుందా ? అనే సందేహాలు లేకపోలేదు . అసలు తెలంగాణాలో తప్ప బీఆర్ యస్ మనగడ ఎక్కడ లేదు . ఉనికి లేదు . కమిటీలు లేవు …విలీనమైన పార్టీలు లేవు … నిర్మాణంలేదు .. ప్రజలను సమీకరించాకలిగే బలమైన నినాదం లేదు … 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో గెలిచింది కేవలం 9 సీట్లు … వివిధ రాష్ట్రాల నుంచి మద్దతు ఉందని కేసీఆర్ చెపుతున్నా, ఎక్కడ నుంచి సరైన స్పందన లేదు . బీఆర్ యస్ నిలబడుతుందా ? లేక కొందరు అంటున్నట్లు విఆర్ యస్ గా మారుతుందా ? అనే అనుమానాలు ఉన్నాయి.

టీఆర్ యస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ యస్ ను బీఆర్ యస్ లో విలీనం చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు . దీనిపై ఎవరు భిన్నాభిప్రాయాలు చెప్పలేదు .కనీసం తమ అభిప్రాయాలూ కూడా తీసుకోలేదని టీఆర్ యస్ నేతల్లో గుసగులు బయలు దేరాయి. పైగా టీఆర్ యస్ రద్దు లేదా బీఆర్ యస్ విలీనంపై కూడా టీఆర్ యస్ కార్యకర్తలకు మింగుడు పడని విషయంగా ఉంది. టీఆర్ యస్ ను అలాగే ఉంచి జాతీయ పార్టీని పెడితే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బీజేపీ దేశంలో మత రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలను లేకుండా చేస్తుందని ,దాని అరాచక, నియంతృత్వ ,విచ్చిన్నకర విధానాలను ,పార్టీలను కూల్చి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే విధానాలకు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ , కాంగ్రెస్ లకు ప్రత్యాన్మాయంగా రాజకీయ వేదిక అవసరం ఉందని అందుకే జాతీయపార్టీని ఏర్పాటు చేసినట్లు గులాబీ నేతలు చెపుతున్నారు . తమ నాయకుడు కేసీఆర్ ఇప్పుడు దేశ్ కి నేత అయ్యారని ,అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయపార్టీలు బీఆర్ యస్ లో విలీనం అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు . బీజేపీకి ప్రత్యాన్మాయంగా రాజకీయ పార్టీ అవసరం ఉందని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక మంది రాజకీయనాయకులు తమను దేశ రాజకీయాల్లోకి రావాలని వత్తిడి తెస్తున్నారని అందువల్ల బీఆర్ యస్ పార్టీని ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ అండ్ కో ప్రచారం చేస్తుంది. కానీ ఇప్పటివరకు దేశంలో బీఆర్ యస్ వచ్చిందని అందులో తాము విలీనం అవుతున్నట్లు ఏ ఒక్క పార్టీ ప్రకటించలేదు . మునుగోడు ఎన్నికల్లో సైతం బీఆర్ యస్ …టీఆర్ యస్ అనే సందేహం గులాబీ శ్రేణుల్లోనేవుంది . కొంతమంది బీఆర్ యస్ బీజేపీకి బినామీ అని విమర్శిస్తున్నారు . చూద్దాం కేసీఆర్ అనే రాజకీయ చాణిక్యుడు ఎలాంటి మలుపు తిప్పుతారో …

Related posts

బీజేపీ బరితెగింపు పాలన…సిపిఎం ,సిపిఐ ,ప్రజాపంథా , టీఆర్ యస్

Drukpadam

దటీస్ స్టాలిన్ …తమిళుల జైజైలు…

Drukpadam

కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆధిక్యత—!

Drukpadam

Leave a Comment