Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో జలపాతంలో పడి నూజివీడు ఇంజినీరు మృతి

అమెరికాలో జలపాతంలో పడి నూజివీడు ఇంజినీరు మృతి

  • పదేళ్ల క్రితం కెనడా వెళ్లిన హరీశ్ చౌదరి
  • ఈ నెల 11న స్నేహితులతో కలిసి అమెరికా సందర్శన 
  • ఇతాకా జలపాతం వద్ద ఫొటో తీసుకుంటుండగా ప్రమాదం
  • వెనక్కి జారిపడి జలపాతంలో కొట్టుకుపోయి మృతి

అమెరికాలో జలపాతంలో పడి ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఇంజినీరు మృతి చెందారు. మెకానికల్ ఇంజినీర్ అయిన నెక్కలపు హరీశ్ చౌదరి (35) పదేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసి కెనడాలోని అంటారియోకు వెళ్లి ఓ కంపెనీలో టూల్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఆయనకు సాయిసౌమ్యతో వివాహమైంది.

ఈ నెల 8న ఐదుగురు స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం హరీశ్ అమెరికా వెళ్లారు. 11న న్యూయార్క్‌లోని ఇతాకా జలపాతం సందర్శనకు వెళ్లారు. అక్కడ ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు హరీశ్ వెనక్కి జారిపడి జలపాతంలో పడిపోయారు. నీటి ఉద్ధృతికి జలపాతంలో కొట్టుకుపోయి మృతి చెందారు. అమెరికాలోని ‘తానా’ సాయంతో హరీశ్ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

Related posts

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం… ఆరుగురి మృతి!

Drukpadam

అత్యాచారం కేసులో ఒక్క రోజులోనే విచారణ పూర్తి, దోషికి యావజ్జీవం.. దేశంలోనే తొలిసారి!

Drukpadam

ఎల్బీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం, 50కి పైగా కార్లు దగ్ధం…

Drukpadam

Leave a Comment