Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తనపట్ల వివక్ష …సొంతపార్టీ పై శశిథరూర్ వ్యాఖ్యలు…

పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తనపట్ల వివక్ష …సొంతపార్టీ పై శశిథరూర్ వ్యాఖ్యలు…
-ఖర్గే కు అన్నిరాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లు సీఎల్పీ నేతలు స్వాగతం -పలుకుతున్నారు …నాకు మొఖం చాటేస్తున్నారు ….
-ఈ నెల 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
-బరిలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్
-ప్రచారంలో పీసీసీ చీఫ్ లు సహకరించడంలేదన్న థరూర్
-ఓటర్ల లిస్టు అసంపూర్తిగా ఉందని వెల్లడి
-శశి థరూర్ తీవ్ర అసంతృప్తి ..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 19న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో, శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో తన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. మల్లికార్జున ఖర్గేతో పోల్చితే పార్టీలో తనకు అందుతున్న సహకారం ఏమంత సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు.

తాను ప్రచారం కోసం రాష్ట్రాలకు వెళితే, అక్కడి పీసీసీ చీఫ్ లు మొహం చాటేస్తున్నారని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గే ఏ రాష్ట్రానికైనా వెళితే అక్కడి పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత స్వయంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారని, ఆయన చెంతనే కూర్చుని, ఇతర నేతలను కూడా రావాలని ఆహ్వానిస్తున్నారని థరూర్ వివరించారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో ఒక్కరికే ఈ తరహా మర్యాదలు దక్కుతున్నాయని, తాను వెళితే ఎవరూ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళితే, అక్కడ పీసీసీ చీఫ్ అందుబాటులో లేకుండా పోయాడని పేర్కొన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేసే సభ్యుల జాబితాను అందజేయడంలోనూ వివక్ష కనిపిస్తోందని, తనకు ఇంతవరకు పూర్తిస్థాయి ఓటర్ల జాబితాను అందించలేదని అసంతృప్తి వెలిబుచ్చారు. ఓ లిస్టు అందజేస్తే అందులో ఫోన్ నెంబర్లు లేవని, ఫోన్ నెంబర్లు లేకుండా తాను వారితో ఎలా మాట్లాడగలనని శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని తాను అనడంలేదని, 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతుండడంతో కొన్ని లోపాలు చోటుచేసుకుంటున్నాయని థరూర్ అభిప్రాయపడ్డారు.

 

పార్టీలో సమానత్వం చూపిండంలేదంటూ థరూర్ చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే స్పందన

  • మరి కొన్నిరోజుల్లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
  • పార్టీ నేతల నుంచి సహకారం అందడంలేదన్న థరూర్
  • ఖర్గేకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణ
  • తామిద్దరి మధ్య విభేదాలు లేవన్న ఖర్గే
  • అన్నదమ్ముల్లాంటి వాళ్లమని వ్యాఖ్యలు
Mallikarjuna Kharge reacts to Shashi Tharoor criticism
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సమానత్వం చూపించడంలేదని, తన ప్రత్యర్థి మల్లికార్జున ఖర్గేకు ఇస్తున్నంత ప్రాధాన్యత తనకు ఇవ్వడంలేదని శశి థరూర్ ఆరోపించడం తెలిసిందే. దీనిపై మల్లికార్జున ఖర్గే స్పందించారు.

తనకు, థరూర్ కు మధ్య ఎలాంటి శత్రుత్వంలేదని స్పష్టం చేశారు. తామిద్దరం అన్నదమ్ముల్లాంటి వాళ్లమని, తమ మధ్య విభేదాలు లేవని పేర్కొన్నారు. “కొందరు భిన్నంగా మాట్లాడతారు, దానిపై నేను మరో విధంగా స్పందించగలను… కానీ థరూర్ తో నాకు ఎలాంటి సమస్యలు లేవు” అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.

మరో నాలుగు రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండగా, 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే ఫేవరెట్ గా కనిపిస్తున్నారు. ఖర్గే, థరూర్ ఇద్దరికీ తమ ఆశీస్సులు ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నప్పటికీ, పలువురు నేతలు ఖర్గే వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలోనే శశి థరూర్ తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు.

Related posts

బీజేపీ ముక్తు భారత్ లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు కృషి : పాట్నా లో కేసీఆర్

Drukpadam

కేసీఆర్ దళిత ద్రోహి: నిప్పులు చెరిగిన పొన్నాల లక్ష్మయ్య…

Drukpadam

లేదు లేదు అంటూనే సింగరేణి ప్రవేటీకరణ …కేంద్రంపై నామ ధ్వజం !

Drukpadam

Leave a Comment