Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెట్రోలియం డీలర్స్ సమస్యపై కేంద్రమంత్రికి టీఆర్ యస్ ఎంపీ వడ్ఢరాజు వినతి..

పెట్రోలియం డీలర్స్ సమస్యపై కేంద్రమంత్రికి టీఆర్ యస్ ఎంపీ వడ్ఢరాజు వినతి..
పెట్రోలియం డీలర్స్ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలిpe

రాజ్యసభ సభ్యులు, పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పెట్రోలియం డీలర్స్ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాల్సిందిగా ఆ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి, కమిటీ ఛైర్మన్ రమేష్ విదౌరిలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పార్లమెంటరీ స్థాయీసంఘం సమావేశంలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర ,మొదటి సమావేశంలోనే డీలర్ల సమస్యలపై మంత్రిని స్థాయీసంఘం చైర్మెన్ లను కలిసి

దేశంలోని 25రాష్ట్రాలకు సంబంధించిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తన దృష్టికి తెచ్చిన సమస్యలపై విదౌరిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సందర్భాలలో పెట్రోలియం డీలర్స్ ప్రజలకు నిత్యావసర సరుకులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటూ,పలు ప్రభుత్వ పథకాల అమలునకు తమ వంతు కృషి చేస్తున్నారన్నారు.
కోవిడ్ సమయాలలో వాళ్లు ముందు వరుసలో నిలిచి ప్రజలకు సహాయ సహకారాలు అందజేస్తున్నారని వినతి పత్రంలో అసోసియేషన్ పేర్కొంది. అయితే వారికి పెట్రోల్,డీజిల్ అమ్మకాలపై మార్జిన్ చెల్లింపులో అన్యాయం జరుగుతున్న విషయాన్ని రవిచంద్ర వివరించారు.ఒక్క రూపాయి మార్జిన్ చెల్లిస్తే 43 పైసలు ఆయిల్ మార్కెటింగ్ కార్పొరేషన్ కు చెందుతుందని ఆయన వివరించారు.
ఈ విషయాన్ని పార్లమెంట్ హౌస్ అనెక్స్ లో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ మొదటి సమావేశంలో ఛైర్మన్ రమేష్ విదౌరి దృష్టికి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఈ విషయంలో మంత్రి హరిదీప్ సింగ్ పూరి చొరవ తీసుకుని డీలర్లకు వెంటనే తగు న్యాయం చేసేలా చూడాల్సిందిగా విదౌరిని ఎంపీ రవిచంద్ర కోరారు. అందుకు స్పందించిన మంత్రి ఎంపీ తన దృష్టికి తెచ్చిన అంశాలపై పరిశీల చేసి తగు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు .

Related posts

రాష్ట్రంలో మొత్తం ప్రజాప్రతినిధులు 23,523

Drukpadam

సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై విచారణ మరోమారు వాయిదా!

Drukpadam

ధనవంతుల కుటుంబాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న యూఏఈ!

Drukpadam

Leave a Comment