Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మూడు రాజధానుల ఉద్యమానికి ప్రభుత్వమే స్పాన్సర్: సీపీఐ నారాయణ

 

  • విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు
  • అమరావతికి గతంలో జగన్ ఆమోదం తెలిపారన్న నారాయణ
  • ఇప్పుడు మాట మార్చారని వెల్లడి
  • రాజధాని ఏదో ఏపీ ప్రజలు చెప్పలేకపోతున్నారని ఆవేదన

ఏపీ రాజధాని అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. విజయవాడలో జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటిస్తే, నాడు జగన్ ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. ఇప్పుడు జగన్ మాట మార్చి మడమ తిప్పారని విమర్శించారు.

మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని నారాయణ వెల్లడించారు. బిడ్డకు మూడేళ్లు వచ్చినా, తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి అంటూ అభివర్ణించారు. మూడు రాజధానుల ఉద్యమానికి ప్రభుత్వమే స్పాన్సర్ అని వ్యాఖ్యానించారు. విశాఖలో భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ, ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్ కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. వైసీపీ విశాఖ గర్జన పూర్తిగా విఫలమైందని, అందుకే వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని రామకృష్ణ పేర్కొన్నారు.

అమరావతే ఏపీకి ఏకైక రాజధాని… సీపీఐ మహాసభల్లో తీర్మానం
విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు
అమరావతిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముప్పాళ్ల నాగేశ్వరరావు
వివిధ రాష్ట్రాల ప్రతినిధుల ఆమోదం

విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు సీపీఐ అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని సీపీఐ మహాసభల్లో తీర్మానం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అమరావతి ఏకైక రాజధాని అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, జాతీయ మహాసభల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్టచర్యలను ఉపసంహరించుకోవాలని సీపీఐ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సానుకూలంగా స్పందించి సత్వరమే నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు.

Related posts

మీడియా నా టీ షర్ట్ మాత్రమే చూసింది.. పేదల చిరిగిన బట్టలను పట్టించుకోలేదు: రాహుల్ గాంధీ!

Drukpadam

త్వరలో టీఆర్ యస్ ద్విదశాబ్ది ఉత్సవాలు…రాష్ట్ర సమావేశంలో నిర్ణయం…

Drukpadam

కేసీఆర్ చెప్పిన మాటలు తెలంగాణ మంత్రులు వినలేదా?: సజ్జల ఫైర్

Drukpadam

Leave a Comment