Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీ పాలనలో మరోసారి దిగజారిన భారత్: సిపిఎం..

మోడీ పాలనలో మరోసారి దిగజారిన భారత్: సిపిఎం
-ఎరువుల సబ్సిడీని ఎత్తివేసేందుకే ”పీఎం ప్రణామ్‌”
– ”పీఎం ప్రణామ్‌” ను వెనక్కు తీసుకోవాలి
-రైతులకు ఇస్తున్న సబ్సిడీలను పెంచాలి
-సిపియం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

మోడీ సర్కారు దేశంలోని ప్రజల ఆకలి తీర్చటంలో విఫలం అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు.ఇందుకు ప్రపంచ ఆకలి సూచీలో దిగజారిన భారత్ ర్యాంకులే నిదర్శనం అని అన్నారు.ఆర్ధికంగా తన కంటే చిన్న వైన పోరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్ లు భారత్ కంటే మెరుగైన స్థానాలను సొంతం చేసుకున్నాయి.101నుంచి 107ర్యాంకుకు పడిపొవడం కేంద్రం బాధ్యత వహించాలని కోరారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆకలి సూచీలో ఇది భారత్ దారుణమైన ప్రదర్శన అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం ఖమ్మం సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యతన జరిగిన ఖమ్మం నియోజకవర్గ బాధ్యులు సమావేశం లో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుల ఎరువుల సబ్సిడీ రు.1.25 లక్షల కోట్ల నుండి 2.50 కోట్లకు పెరిగిందని, దీన్ని తగ్గించడానికి ”పీఎం ప్రణామ్‌” పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆహారభద్రతకు అత్యంత ప్రమాదకరం. ప్రతియేటా 1.9శాతం జనాభా పెరుగుతున్నా, సాగు విస్థీర్ణం తగ్గుతున్నది. ప్రస్తుతం ఎరువుల వినియోగం తగ్గిస్తే, ఉత్పాదకత మరింత తగ్గుతుంది. కాబట్టి ”పీఎం ప్రమాణ్‌”ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని, ప్రస్తుతమిస్తున్న సబ్సిడీలను మరింత పెంచి, భూసార పరీక్షలను బట్టి సేంద్రీయ, రసాయనిక ఎరువుల వినియోగంతో వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలని, సీపీఐ(ఎం) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నదని తెలిపారు.
ఇప్పటికే ఏటా రు.4లక్షల కోట్ల విలువైన వంట నూనెలు, పప్పులు, పంచదార, మాంసం, పాల ఉత్పత్తులు మరియు చిరుదాన్యాల ఉప ఉత్పత్తులను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. దీనికి తోడు రసాయనిక ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, సేంద్రీయ ఎరువులను వాడాలని, ప్రస్తుతమిస్తున్న సబ్సిడీలను తగ్గించి, వచ్చిన మొత్తంలో 50శాతం రాష్ట్రాలకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. సేంద్రీయ ఎరువుల వాడకం చైతన్యానికి నిధులు ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటిస్తున్నారు. కానీ శ్రీలంక అనుభవం చూస్తే సేంద్రీయ ఎరువుల వల్ల ఆహార దాన్యాల ఉత్పత్తి తగ్గింది. హెక్టారుకు చైనా 400 కిలోలు, అమెరికా 350 కిలోల ఎరువులను వినియోగించి అదనపు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. కానీ మన దేశంలో హెక్టార్‌కు 175 కిలోల ఎరువులను మాత్రమే వినియోగించి, హెక్టార్‌కు కేవలం 2.5 టన్నులే దిగుబడి తీస్తున్నాము. చైనా, అమెరికా తమ బడ్జెట్‌లో 7నుండి 8శాతం వ్యవసాయంపై ఖర్చుచేస్తుంటే, చేస్తుంటే, భారత్‌ కేవలం 2.3శాతమే ఖర్చు చేస్తున్నది. దీనికి కూడా కోత పెడితే దిగుబడి తగ్గి రైతులు దివాళాతీస్తారు. దీంతో రైతులు తమ భూములను కార్పొరేట్‌ సంస్థలకు అమ్ముకునేందుకు చేసిన కుట్ర ఇది. పార్లమెంట్‌లో వీగిపోయిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో భాగమే ఇది. తక్షణమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నదని నున్నా తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రం, కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస రావు , విష్ణు వర్ధన్,
పి.రమ్య,మండల కార్యదర్శులు బోడపట్ల సుదర్శన్, తుషాకుల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

త‌ణుకులో హైటెన్ష‌న్‌!… అమ‌రావ‌తి రైతుల యాత్ర‌కు వైసీపీ శ్రేణుల నిర‌స‌న‌!

Drukpadam

తెలంగాణ సీఎం కేసీఆర్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంశల జల్లు!

Drukpadam

వైసీపీలో జిల్లాల ర‌చ్చ‌.. కోన‌సీమ జిల్లాలో ఎంపీటీసీ స‌హా 38 మంది రాజీనామా!

Drukpadam

Leave a Comment