Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడు ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్ …

మునుగోడు ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్ …
స్వామి గౌడ్ , దాసోజు శ్రవణ్ బీజేపీ నుంచి బయటకి అదే దారిలో మరికొందరు
మీ రాజకీయాలు మాకు నచ్చలేదంటూ బీజేపీకి గుడ్ బై
కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
బీజేపీకి రాజీనామా ప్రకటించిన దాసోజు, స్వామి గౌడ్
గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి రాజీనామాలు చేసిన వైనం
ప్రగతి భవన్ లో సందడి వాతావరణంలో టీఆర్ఎస్ లోకి చేరిక

బీజేపీకి రాజీనామా చేసిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లు శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ లో చేరారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇద్దరు కీలక నేతలు ఒకేసారి పార్టీలో చేరడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల నినాదాలతో ప్రగతి భవన్ మారుమోగింది.నిన్న భిక్షమయ్య గౌడ్ , మొన్న పల్లె రవి దంపతులు చేరడంతో మునుగోడుపై టీఆర్ యస్ కు ఆశలు చిగురించాయి. స్వామి గౌడ్ ,శ్రవణ్ లు ఒకరు టీఆర్ యస్ నుంచి మరొకరు కాంగ్రెస్ నుంచి బీజేపీలో కొద్దికాలం క్రితం చేరారు . వారు ఆశించినమేరకు బీజేపీ బీసీలకు పదవులు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు .

స్వామి గౌడ్ తో పాటు దాసోజు శ్రవణ్ కూడా శుక్రవారమే బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన స్వామి గౌడ్.. 2020లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ తీరు నచ్చని క్రమంలో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తన సొంత గూటికి చేరుకున్నారు. ఇక దాసోజు శ్రవణ్ 3 నెలల క్రితమే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు. బీజేపీలోకి వెళ్లిన నెలల వ్యవధిలోనే ఆ పార్టీకి దాసోజు గుడ్ బై చెప్పడం గమనార్హం.

బీజేపీలో చేరి మూడు నెలలు కూడా కాకుండానే ఆ పార్టీకి దాసోజు శ్రవణ్ షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారు. గత సెప్టెంబర్ లో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.

బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన లాంటి బలహీన వర్గాలకు చెందిన నేతలకు బీజేపీలో స్థానం ఉండదనే విషయం అర్థమయిందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని దుయ్యబట్టారు. డబ్బు, మద్యం అండతో గెలవాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. దశ, దిశ లేకుండా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

మునుగోడు టీఆర్ యస్ టికెట్ ఆశించి భంగపడ్డ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పార్టీకి రాజినామా చేసి బీజేపీ లో చేరిన సందర్భంగా టీఆర్ యస్ కు నష్టం జరిగినట్లుగా ప్రచారం జరిగింది.కానీ నేడు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఇద్దరు ప్రముఖనేతలు తిరిగి టీఆర్ యస్ గూటికి రావడం పట్ల టీఆర్ యస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు మునుగోడు ఎన్నికల మీద ఖచ్చితంగా పడతాయని పరిశీలకుల అభిప్రాయం .బీజేపీ లో చేరిన మరికొందరు నాయకులూ కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. చూద్దాం ఏమిజరుగుతుందో …

Related posts

వైఎస్ హయాం నాటి నాసిరకం పనుల వల్లే గేటు కొట్టుకుపోయింది: చంద్రబాబు…

Drukpadam

ఈ కిరికిరిగాళ్లు, ఈ కొండెగాళ్లకు ఏంటి కడుపుమంట?: సీఎం కేసీఆర్!

Drukpadam

తెలుగు రాష్ట్రాల నుంచి 6 గురు రాజ్యసభకు ఏకగ్రీవమే ….!

Drukpadam

Leave a Comment