Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీ అనుమతి లేకుండా పర్యటనపై చర్యలు ఉంటాయి. ప్రభుత్వ విప్ రేగా!

పార్టీ అనుమతి లేకుండా పర్యటనపై చర్యలు ఉంటాయి. ప్రభుత్వ విప్ రేగా!
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి పినపాక పర్యటనలపై రేగా గుర్రు
సమయం వచ్చినప్పుడు పర్యటనల సంగతి తేలుస్తాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 కు 5 సీట్లు గెలుస్తాం
బీఆర్ యస్ కు మంచి భవిష్యత్కేసీఆర్ పై దేశ ప్రజల చూపు
పోడుభూముల సమస్యల పరిస్కారం దిశగా అడుగులు
జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం 20 ఎకరాలు

ఉమ్మడి ఖమ్మంజిల్లా టీఆర్ యస్ లో జరుగుతున్న పరిణామాలు కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షులు , ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఖమ్మం లో చిట్ చాట్ పెట్టి తన అభిప్రాయాలను మీడియాతో పంచుకొనే ప్రయత్నం చేశారు . గత కొంతకాలంగా తన సొంత నియోజకవర్గం అయిన పినపాకలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది . ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఒక హోటల్ లో ఆయన మీడియా కలవాలని కబురు రాగానే ఇందులో విశేషం ఎదో ఉంటుందని మీడియా ప్రతినిధులు భావించారు . రాజకీయాలపై సంచలన కామెంట్ చేసేందుకే ఖమ్మంలో విలేకర్ల సమావేశం పెట్టారని అనుకున్నారు . కానీ ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. తన చిట్ చాట్ ను సాదా సీదాగా నిర్వహించారు.పార్టీ వ్యవహారాలు ,భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కాలేజీ , పోడుభూములు సమస్యమపై కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను రేగా హర్షించరు . త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయం తోపాటు మెడికల్ కాలేజీ ల ప్రారంభోత్సవాలకు సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని తెలిపారు .

అయితే కొందరు మీడియా ప్రతినిధులు పొంగులేటి పర్యటనపై గుచ్చిగుచ్చి ప్రశ్నించగా అనుమతిలేకుండా పర్యటనలపై పార్టీ తప్పకుండ చర్యలు ఉంటాయని అన్నారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకంగా పినపాక నియోజకవర్గంలో పర్యటించి తనకు వ్యతిరేకంగా ఉన్న తుళ్లూరు బ్రహ్మయ్య , మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లాంటి పార్టీ నాయకులను వెంటవేసుకొని తిరిగటంపై రేగా గుర్రుగా ఉన్నట్లు కనిపించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 కు 5 సీట్లు గెలుస్తాం ..

భద్రాది కొత్తగూడెం జిల్లాలో 5 సీట్లు ఉన్నాయని 5 సీట్లను తమపార్టీ గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు . కేసీఆర్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ అసెంబ్లీ కా , పార్లమెంట్ కా అనేది ఆయనే నిర్ణయిస్తారని ఆనిర్ణయానికి కట్టు బడి పనిచేస్తానని అన్నారు.

జిల్లాలో జర్నలిస్టులకు 20 ఎకరాల స్థలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టల కోసం 20 ఎకరాలను గుర్తించి కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కు పంపించామని త్వరలనే ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు .

 

Related posts

వెలమ, రెడ్డి, కమ్మ అని రాయరెందుకు? ఆ పదమే పెద్ద కుట్ర..ఆర్‌ఎస్ ప్రవీణ్ తీవ్ర అభ్యంతరం!

Drukpadam

అక్టోబర్ 9న దళిత బంధు కై చలో హైదరాబాద్…

Drukpadam

మునుగోడు స్టార్ క్యాంపైనర్స్ లోలేని జగ్గారెడ్డి పేరు …

Drukpadam

Leave a Comment