Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఇండియా …పాక్ మ్యాచ్ నోబాల్ పై షోయబ్ అఖ్తర్ విమర్శలు!

ఇండియా …పాక్ మ్యాచ్    నోబాల్ పై షోయబ్ అఖ్తర్ విమర్శలు!

  • నిన్నటి మ్యాచ్ లో పాక్ పై విజయం సాధించిన కోహ్లీ
  • చివరి ఓవర్ లో నడుము కంటే ఎత్తులో వచ్చిన బంతిని నోబాల్ గా ప్రకటించిన అంపైర్లు
  • ఈ రాత్రికి మీకు భోజనం పక్కా అంటూ ట్వీట్ చేసిన అఖ్తర్

ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య నిన్న జరిగిన హైఓల్డేజ్ టీ20 మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో ఇండియాకే చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అయితే చివరి ఓవర్లో డ్రామా చోటుచేసుకుంది. మహ్మద్ నవాజ్ వేసిన నాలుగో బంతిని కోహ్లీ సిక్సర్ గా మలిచాడు. అయితే ఈ బంతిని నడుము కంటే ఎత్తుగా వచ్చిన నేపథ్యంలో నోబాల్ గా ప్రకటించాలని అంపైర్లను కోహ్లీ కోరాడు. ఈ క్రమంలో ఆ బంతిని అంపైర్లు నోబాల్ గా ప్రకటించారు. ఇండియాకు ఫ్రీ హిట్ వచ్చింది. ఈ నోబాల్ మ్యాచ్ ను మలుపు తిప్పిందనే అనుకోవచ్చు.

మరోవైపు, ఈ నోబాల్ పై పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ స్పందిస్తూ… అంపైర్ భయ్యో… మీ ఆలోచనలకు నమస్కారం.. ఈ రాత్రికి మీకు భోజనం పక్కా అని ట్వీట్ చేశారు. మరోవైపు అంపైర్ నిర్ణయంపై పాకిస్థాన్ ప్రేక్షకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

Related posts

వరల్డ్ కప్ లో ఆసీస్ మళ్లీ ఓడింది… ఇవాళ మరీ ఘోర పరాజయం

Ram Narayana

భారత ఆటగాళ్లను గేలి చేసిన ఫ్యాన్స్.. ఆస్ట్రేలియాలో షాకింగ్ పరిణామం!

Ram Narayana

ఐపీఎల్ జరగాలంటే… బీసీసీఐ ముందున్న ఆప్షన్లు ఇవే!

Drukpadam

Leave a Comment