Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నవంబరు 11న విశాఖకు ప్రధాని..

నవంబరు 11న విశాఖకు ప్రధాని.. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన!

  • రూ. 400 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు
  •  మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
  • విశాఖలో భారీ బహిరంగ సభ
  • పాల్గొననున్న సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

నవంబరు 11వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో రానున్నారు . ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన విశాఖ పర్యటన ఖరారు అయింది .

ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని విశాఖ పర్యటనలో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల రైల్వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు .అంతేకాకుండా ఏపీకి కొన్ని ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టిడిపి వైసిపి మధ్య రాజధానుల యుద్ధంలో రైతుల పేరుతో జరుగుతున్న యాత్ర ఫేక్ యాత్ర అని అది టీడీపీ స్పాన్సర్డ్ యాత్ర అని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరే విధంగా యాత్రలో పాల్గొన్న 600 మందిలో కేవలం 60 నుంచి 70 మంది మాత్రమే నిజమైన రైతులు ఉన్నారని తేలడంతో టీడీపీ తెల్లముఖం వేసింది
అందువల్ల ఆయాత్ర నిలిపి వేయాలని ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది .పరిశీలించిన కోర్ట్ యాత్రలో పాల్గొన్న వారు నిజమైన రైతులు అవునా కాదా అనే విషయంతో పాటు వారి గుర్తింపు కార్డులు కూడా సేకరించి విచారించాలని పేర్కొన్నారు. 600 మంది మాత్రమే పాల్గొనండి . మిగతా వారు ఎవరూ పాల్గొనడానికి వీల్లేదని ఒకవేళ యాత్రకు సంఘీభావం తెలియజేయాలి వస్తే రోడ్డు పక్క నుండి సంఘీభావం తెలుపాలని కోర్టు పేర్కొంది. దీంతో యాత్రలో పాల్గొన్న వారి వివరాలు సేకరించేందుకు వెళ్లిన పోలీసులకు అనేక అబ్బుర పడే విషయాలు తెలియడంతో నోరెళ్లబెట్టారు. మొత్తం 600 మంది రైతుల పేరుతో అమరావతి అరసవల్లి యాత్ర చేస్తుండగా వారిలో కేవలం 60 నుంచి 70 మంది మాత్రమే నిజమైన రైతులు ఉన్నారని మిగతా వాళ్ళందరూ టిడిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారని తేలడంతో రైతులు అక్కడ నుండి యాత్రను వాయిదా వేస్తూ జారుకున్నారు . ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఏపీకి వస్తున్నారు .

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 11న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ సందర్భంగా రూ. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే, అదే రోజు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం నగరంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ప్రధాని పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారు. ప్రధాని రాక నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ ఇతర అధికారులు నిన్న సమీక్షించారు. అలాగే, డిసెంబరు 4న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న నౌకా దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని సమాచారం.

Related posts

రేపు యాదాద్రి క్షేత్రానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, గవర్నర్, సీఎం కేసీఆర్…

Drukpadam

ఏపీకి చెందిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం!

Drukpadam

నలుగురిని చంపిన చిరుతకు జీవితఖైదు!

Drukpadam

Leave a Comment