Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి …టీడీపీ నేత చంద్రబాబు!

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి …టీడీపీ నేత చంద్రబాబు!
-ఎన్టీఆర్ జిల్లా నేతలతో సమావేశంలో మాట్లాడిన బాబు
-నాయకులూ నిత్యం ప్రజల్లోనే ఉండాలని హితవు
-తాను కూడా ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడి
-వచ్చే మే నెల, లేదా డిసెంబరులో ఎన్నికలు రావొచ్చు
-ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్న చంద్రబాబు

టీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ శాసనసభకు ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చునని బాంబు పేల్చారు . అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు . నిత్యం ప్రజలమధ్యనే ఉండాలని తనుకూడా అందుకు కార్యాచరణ ప్రణాళిక రూపుదిన్చుకుంటున్నాని తెలిపారు .రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా అని ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు . అందువల్ల నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టాలని అన్నారు. జగన్ కు తిరిగి ప్రభుత్వం రాదనే అర్థం అయిందని అందువల్ల ముందుగానే ఎన్నికలలు వెళ్లి లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు . ఎన్ని జిమ్మిక్కులు చేసిన తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చంద్రబాబు పేర్కొన్నారు .

ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేసేదానిలో భాగంగా వివిధ జిల్లాల నేతలతో సమావేశం అవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. వచ్చే మే నెల, లేదా డిసెంబరులో ఎన్నికలు జరగొచ్చని చర్చ జరుగుతోందని తెలిపారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేతలంతా ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. తాను కూడా ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.

రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవని ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవాలని అన్నారు . ప్రతి చిన్న అంశాన్ని అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ ఆలోచిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related posts

ఖమ్మంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉద్రిక్త …పువ్వాడ వర్సెస్ పొంగులేటి…

Drukpadam

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు…!

Drukpadam

ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ను కలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!

Drukpadam

Leave a Comment